గుడ్ న్యూస్: ఇక భూ రిజిస్ట్రేషన్లు మీ గ్రామాల్లోనే..

గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సన్నద్ధం కావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీని వల్ల ప్రతి 2వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయం వస్తుందని తెలిపారు. ప్రజలకు అత్యంత చేరువలో సేవలు లభిస్తాయని.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో భూములపై తగిన పర్యవేక్షణ ఉంటుందన్నారు. దీనివల్ల ఆక్రమణలు, అన్యాక్రాంతాలకు ఆస్కారం ఉండదన్నారు. వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ నిర్మాణంపైనా సీఎం జగన్ సమీక్షించారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని […]

Written By: NARESH, Updated On : July 31, 2021 12:16 pm
Follow us on

గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సన్నద్ధం కావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీని వల్ల ప్రతి 2వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయం వస్తుందని తెలిపారు. ప్రజలకు అత్యంత చేరువలో సేవలు లభిస్తాయని.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో భూములపై తగిన పర్యవేక్షణ ఉంటుందన్నారు. దీనివల్ల ఆక్రమణలు, అన్యాక్రాంతాలకు ఆస్కారం ఉండదన్నారు.

వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ నిర్మాణంపైనా సీఎం జగన్ సమీక్షించారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. విశాఖ అభివృద్ధి పనులపై కూడా సమీక్షించి వేగంగా పనులు చేయాలని ఆదేశించారు.

మున్సిపాలిటీలు, నగరాల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మున్సిపల్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ పట్టణాలు, నగరాలు పరిశుభ్రంగా ఉంచాలని.. రోడ్ల మరమ్మతుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

షెడ్యూల్ ప్రకారం టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలని.. 45వేలకు పైగా ఇళ్లు మూడు నెలల్లోగా మిగిలిన ఇళ్లు డిసెంబర్ లోగా అప్పగించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.