మాతృదేశం కోసం అమెరికా సీఈవోల పెద్దమనసు

ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా పుట్టిన ఊరుపై మమకారం ఎప్పటికీ చావదు. ఇప్పుడు భారత్ లో చదువుకొని.. ఇక్కడే ఎదిగి.. అగ్రరాజ్యం అమెరికా వెళ్లి అక్కడి దిగ్గజ కంపెనీలను లీడ్ చేస్తున్న మన దేశపు ఇంజినీర్లు, ఐఐటీయన్లు ఇప్పుడు భారత్ కోసం ఏకమయ్యారు. కరోనా కల్లోలంతో కల్లోల భరితంగా ఉన్న భారత్ ను రక్షించేందుకు నడుం బిగించారు. సొంత దేశం కోసం అమెరికాలో ఉన్న టాప్ 40 కంపెనీల సీఈవోలు ఏకం కావడం ఒక గొప్ప పరిణామంగా చెప్పొచ్చు. […]

Written By: NARESH, Updated On : April 27, 2021 1:20 pm
Follow us on

ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా పుట్టిన ఊరుపై మమకారం ఎప్పటికీ చావదు. ఇప్పుడు భారత్ లో చదువుకొని.. ఇక్కడే ఎదిగి.. అగ్రరాజ్యం అమెరికా వెళ్లి అక్కడి దిగ్గజ కంపెనీలను లీడ్ చేస్తున్న మన దేశపు ఇంజినీర్లు, ఐఐటీయన్లు ఇప్పుడు భారత్ కోసం ఏకమయ్యారు. కరోనా కల్లోలంతో కల్లోల భరితంగా ఉన్న భారత్ ను రక్షించేందుకు నడుం బిగించారు. సొంత దేశం కోసం అమెరికాలో ఉన్న టాప్ 40 కంపెనీల సీఈవోలు ఏకం కావడం ఒక గొప్ప పరిణామంగా చెప్పొచ్చు.

అమెరికాలోని దిగ్గజ కంపెనీలను భారతీయులే లీడ్ చేస్తున్నారు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ను సుందర్ పిచాయ్, మరో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ను మన తెలుగు వాడు సత్య నాదెళ్ల సీఈవోగా ఏలుతున్నారు. ఇదే కాదు.. డెలాయిట్ సీఈవో పునీత్ రెంజెన్ సహా చాలా కంపెనీలను మన భారతీయులే నడిపిస్తున్నారు.

ఇప్పుడు కరోనాతో భారత్ విలవిలలాడుతున్న వేళ మాతృదేశం కోసం వారు అంతా ఏకమయ్యారు. అమెరికాలోని పేరెన్నికగన్న దాదాపు 40 కంపెనీలు ఏకతాటిపైకి వచ్చాయి. ఓ కార్యదళంగా ఏర్పడి భారత్ కు కావాల్సిన సహకారం అందించాలని నిర్ణయించాయి. ఈ క్రతువును అమెరికాలోని భారత వాణిజ్య సంఘాలు పర్యవేక్షిస్తున్నాయి. సోమవారం సమావేశమై భారత్ కు 20వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపాలని డిసైడ్ అయ్యారు. భారత్ కు కొద్దిరోజుల్లోనే కీలక వైద్య పరికరాలు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ సహా ఇతర కీలక సరఫరాలను చేయాలని వీరి ఉమ్మడి టాస్క్ ఫోర్స్ నిర్ణయించింది.

అమెరికాలో ఎంతో ఎత్తుకు ఎదిగి.. అక్కడి కంపెనీలను టాప్ లో నిలబెట్టిన భారతీయులు ఇప్పుడు మాతృదేశంలో నెలకొన్న ఆరోగ్య సంక్షోభాలను రూపుమాపేందుకు అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్ వర్గాలు టాస్క్ ఫోర్స్ గా ఏర్పడడం నిజంగా ఇదొక గొప్ప పరిణామం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాతృదేశం రుణం తీర్చుకునేందుకు అమెరికా సర్కార్ ను, అక్కడి కంపెనీలను ఒప్పించి మెప్పించి వీరు చేస్తున్న సాయం ఇండియా ఒంటరి కాదన్న సంకేతాన్ని ఇచ్చినట్టైంది.