BRS- KTR: ‘అధికారం, పదవుల కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లట్లేదు. గోల్‌మాల్ గుజరాత్ మోడల్ గుట్టు రట్టు చేసి, తెలంగాణ ప్రగతి నమూనాను దేశమంతటికీ విస్తరించేందుకే వెళ్తున్నారు’ అని ప్రకటించారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. తెలంగాణ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. రాబోయే (2024) సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితి పురోగమిస్తుందని తెలిపారు. తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమాగా ఎలా ఆదరణ పొందుతుందే.. బీఆర్‌ఎస్ కూడా పాన్ ఇండియా పార్టీగా దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతుందని, ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జోష్యం చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటకలో తమకు సానుకూల అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కర్ణాటకలో కుమారస్వామితో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. స్వతంత్రభారతంలో నరేంద్రమోదీ అత్యంత అసమర్థ, దివాలాకోరు ప్రధాని విమర్శించారు. గుజరాత్ మోడల్‌ను చూపెట్టి అధికారంలోకి వచ్చిన ఆయన 8 ఏళ్లలో చేసిందేమీ లేదన్నారు. 2022 వరకు అందరికీ ఇళ్లు ఇస్తామని చెప్పిన మోదీ అది చేయకుండా రూ.435 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నారన్నారు.

2024లో కాంగ్రెస్ కనుమరుగు..
2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని జోష్యం చెప్పారు కేటీఆర్. తెలంగాణలో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రకంటే ముందే కాంగ్రెస్ ఎంపీలు ఒకరిద్దరు ఆ పార్టీని వీడతారని ప్రకటించారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌రెడ్డి ఉప ఎన్నికను రుద్దారన్నారు. రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాతే రూ.5వేల కోట్ల లాభం వస్తుందని ఆయన బీజేపీలో చేరారన్నారు. ఉప ఎన్నిక కోసం రాజగోపాల్ రూ.500 కోట్లు ఖర్చు పెట్టేందుకు, ఒక్కో ఓటుకు రూ.30 వేలను వెచ్చించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ తమతోనే ఉన్నారని ప్రకటించారు.
విలువల్లేని రాజకీయాలు..
బీజేపీ విలువలు లేని రాజకీయాలు చేస్తోందని, దానిని నడుపుతోంది గుజరాతీలని, ఆ పార్టీ చరిత్రను ఆధ్వానీ నుంచి అదానీ దాకా విశ్లేషించవచ్చని వెల్లడించారు. మోదీ అధికారంలోకి వచ్చాక నైజీరియా కంటే దారుణంగా భారత్ తయారవుతోందని నివేదికలు చెబుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతీ రంగంలో విఫలమైందన్నారు. మోదీ జన్‌కీ బాత్ వినరు. మన్‌కీ బాత్ మాత్రమే చెబుతారు అని తెలిపారు. గొప్పలు చెప్పుకోవడం మినహా ఏం సాధించలేదన్నారు. ఒక్క ప్రెస్‌మీట్ పెట్టరు. ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేదని విమర్శించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, గ్యాస్‌రేట్లు ఇప్పుడు అత్యధికంగా ఉన్నాయన్నారు. ఒక్క అదానీకి తప్ప ఎవరికీ మంచి రోజులు రాలేదన్నారు. విమోచనం పేరిట సెప్టెంబరు 17న తెలంగాణపై బీజేపీ దండయాత్ర చేసిందని పేర్కొన్నారు. దానికి ఇద్దరు సీఎంలు, కేంద్రమంత్రులను పిలిచారు. రాజకీయ భావదారిద్య్రంతో ఆడిన చిల్లర నాటకమని అభివర్ణించారు. వాస్తవానికి 1947, ఆగస్టు 15న దేశానికి విమోచనమైంది. బ్రిటిష్ వాళ్లు చేసిన అరాచకాలను ఎర్రకోట మీది నుంచి మోదీ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. నిజాం ముస్లిం కాబట్టి, మత ఘర్షణలకు తేవాలనే లక్ష్యంతో సెప్టెంబరు, 17 కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు.
పరిష్కారం చూపుతాం
కేసీఆర్ అన్ని కోణాల్లో ఆలోచించి, అందరితో చర్చించి జాతీయ పార్టీ రూపకల్పన చేశారని తెలిపారు. టీఆర్‌ఎస్ స్థానంలో బీఆర్‌ఎస్ ఏర్పాటుకు ఏకవాక్య తీర్మానం చేసి ఈసీకి ఇచ్చాం. అది రాజ్యాంగబద్ధ సంస్థ, నిష్పాక్షికంగా వెంటనే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ తాగునీరు, ఉచితంగా కరెంటు అందిస్తాం. దళితులను వ్యాపారవేత్తలుగా చేస్తాం. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో చేసిన పని చూపి పంజాబ్‌లో అధికారంలోకి వచ్చారని తెలిపారు. తాము అలానే చేస్తాం. తెలంగాణలో జరుగుతున్న పనిని సమర్థంగా దేశానికి చెప్తాం. మాకంత నేర్పు, ఓర్పు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.
అధికారంలోకి రావడానికి వాళ్లకు 40 ఏళ్లు పట్టింది..
బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడానికి 40 ఏళ్లు పట్టిందని, తమకు అంత సమయం పట్టదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో తమకు అధికారమే పరమావధి కాదని, ప్రజలకు ఏం కావాలో అదే మా ఎజెండా అని ప్రకటించారు. కేసీఆర్ తెలంగాణకు చిహ్నం. బీఆర్‌ఎస్‌ను తెలంగాణ పార్టీ అంటారు.. కానీ మంచి విషయం, సారం ఉంటే ఏ చిత్రమైనా పాన్ ఇండియా సినిమాగా విజయం సాధిస్తుంది. అలాగే కంటెంట్, కటౌట్ ఉన్న పార్టీగా బీఆర్‌ఎస్‌కూ గెలుపు దక్కుతుందని పేర్కొన్నారు. గుజరాత్ సీఎంగా ఉండి మోదీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వంద సభల్లో పాల్గొన్నారు. 2024లోనూ సీఎం కేసీఆర్ అదే మాదిరిగా వంద సభల్లో పాల్గొని ప్రచారం చేస్తారని ప్రకటించారు.
దాడులపై తొలిసారి స్పందన..
జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో తమపై మీద దాడులు, కుట్రలు ఉంటాయి. వాటన్నింటినీ ఎదుర్కొంటామని కేటీఆర్ తొలిసారి స్పందించారు. వ్యవస్థలను ఎలా ఉపయోగించుకుంటారో తమకు తెలుసని..ఈడీ, సీబీఐలు ప్రతిపక్షాలనే లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపారు. మోదీ వ్యూహాలన్నీ తమకు తెలుసని.. వాటిని తిప్పికొడతామని ధీమాగా చెప్పారు. వారి బాగోతాలను బయటపెడతామన్నారు.
ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలం..
‘కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉంది. అది అస్తిత్వం కోసం పోరాడుతోంది. ప్రతిపక్షంగా ఘోరంగా విఫలమైంది’ అన్నారు కేటీఆర్. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాకుండా కాంగ్రెస్ జోడో యాత్ర చేయాలన్నారు. రాహుల్ పాదయాత్ర చేస్తుంటే.. ఆ పార్టీకి చెందిన గోవా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారన్నారు. తెలంగాణలో ఎన్ని రోజులైనా యాత్ర చేసుకోవచ్చని.. దాని వల్ల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాహుల్‌కు తెలుస్తాయన్నారు. రాహుల్ తెలంగాణలో పాదయాత్ర చేసే సమయంలో ఆ పార్టీ ఎంపీలు ఒకరిద్దరు కాంగ్రెస్‌ను వీడుతారని సంచలన ప్రకటన చేశారు.

మునుగోడులో గెలుపుపై ధీమా..
కాంట్రాక్టర్ రాజగోపాల్‌రెడ్డి అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోందని, బీజేపీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మునుగోడులో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 50 శాతానికి పైగా ఓట్లు టీఆర్‌ఎస్‌కు వస్తాయని జోష్యం చెప్పారు. అక్కడ రెండు, మూడు స్థానాల కోసం కాంగ్రెస్, భాజపా మధ్య గట్టి పోటీ ఉంటుందని తెలిపారు.
పదివేలకుపైగా ఫోన్లలో పెగాసస్
దేశంలో పదివేలకు పైగా ఫోన్లలో పెగాసస్ ఉందని కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. తన ఫోన్‌లో కూడా అది ఉందన్నారు. తన ఫోన్ ద్వారా జరిగేదంతా కేంద్రం తెలుసుకుంటోందన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోన్‌ను కూడా మోదీ టాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఆ విషయం ఆయనకు తెలియదన్నారు. దేశంలో ఒక్క ఎన్నికలోనూ గెలవని మోహన్ భాగవత్ జనాభా నియంత్రణ గురించి చెబుతున్నారన్నారు. ఆయనకు ప్రజల గురించి ఏం తెలుసు? కనీసం కౌన్సిలర్‌గానైనా గెలిచి మాట్లాడాలి అని కేటీఆర్ సూచించారు.
Also Read: Baba Vanga Predictions: ఆందోళన కల్గిస్తున్న బాబా వేంగా జోస్యం, ఇండియాలో అలా జరుగుతుందా?
[…] […]