Naga Chaitanya- Samantha: సమంత-నాగ చైతన్య ఎందుకు విడిపోయారనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఎఫైర్స్ కారణమా అంటే అదీ కాదు. ఎందుకంటే విడిపోయి నెలలు గడుస్తున్నా కొత్త రిలేషన్స్ ప్రకటించలేదు. ఇద్దరూ సింగిల్ గానే ఉన్నారు. అంత కంటే విడిపోవడానికి పెద్ద కారణం ఏమై ఉంటుందనే ప్రశ్నలు మెదళ్ళను తొలుస్తున్నాయి. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది. హద్దులు, కట్టుబాట్లే సమంత-నాగ చైతన్య మనస్పర్థలకు బీజం వేసినట్లు సమాచారం. పెళ్ళి అయ్యాక కూడా ఇలా ఉంటే కుదరదని నాగ్ ఫ్యామిలీ ఆమెను కట్టడి చేశారు. ఈ కారణంగా చైతన్యపై కోపంతో సమంత సోషల్ మీడియాలో పేరు మార్చేసింది.

అలాగే విడాకులకు దారితీయడానికి మరొక కారణం 2021 ఆగస్టు 29న జరిగిన నాగార్జున బర్త్ డే వేడుకల్లో సమంత పాల్గొనలేదు. అదే సమయంలో ఆమె ఫ్రెండ్స్ తో కలిసి గోవా ట్రిప్ కి వెళ్లారు. ఆగస్టు 30వ తేదీన సమంత గోవాలో ఉన్నారు. శిల్పారెడ్డి ఫ్యామిలీతో పాటు సమంత గోవా వెళ్లడం జరిగింది. ఈ ట్రిప్ గురించి నాగ చైతన్యకు చెప్పలేదట. ఆయనకు కనీస సమాచారం లేదట. దాంతో సమంతను చైతూ నిలదీశాడట. దానికి సమంత మరింత ఫైర్ అయ్యారని సమాచారం.
పరిమితులు, ఆంక్షల మధ్య లైఫ్ లీడ్ చేయడం ఇష్టపడని సమంత విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. దాంతో నాగ చైతన్యకు దూరంగా వచ్చేశారు. అప్పుడే సమంత-నాగ చైతన్య విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న సమంత-చైతూ 2021 అక్టోబర్ లో అధికారికంగా విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కారణాలు చెప్పకుండా పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు వెల్లడించారు.

ప్రకటన తర్వాత కూడా కుటుంబ సభ్యులు ఇద్దరికీ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సమంత పేరెంట్స్ ఆమెను బుజ్జగించడానికి శాయశక్తులా కృషి చేశారట. సమంత సక్సెస్ ఫుల్ కెరీర్ కూడా నిర్ణయానికి కారణమైంది. ఒక వేళ సుమంత అవకాశాలు లేక సరైన సంపాదన లేక ఫేడ్ అవుట్ దశలో ఉంటే…. వేల కోట్ల ఆస్తి ఉన్న చైతూని వదులుకునేది కాదేమో. ఆమెకు డిమాండ్ ఉంది. సినిమాకు రెండు మూడు కోట్లు తీసుకుంటుంది. బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా మరికొంత సంపాదించగలదు. ఎవరి అండా లేకుండా బ్రతకగలననే ఆమె ధైర్యం మొండిగా వెళ్లేలా చేసింది.