https://oktelugu.com/

బ్రేకింగ్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తెలంగాణలో సోదిలోనే లేని వామపక్షాలు ఇంత పకడ్బందీగా.. ధైర్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందడుగు వేస్తాయని.. ప్రధాన ప్రతిపక్షాలను తోసిరాజని ఏకంగా అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తాయని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఎన్నికలను ప్రకటించిన అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా గోచీ సర్దుకోలేదు. ఇక బీజేపీ ఇప్పుడే తేరుకుంది. కాంగ్రెస్ లో అసలు ఆ హడావుడే లేదు. జనసేనాని పవన్ అమరావతిలో ఉండి హైదరాబాద్ లో పోటీచేస్తామని ప్రకటించారు. వీళ్లంతా ఇంకా ప్రిపేర్ కాని పరిస్థితుల్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2020 / 07:07 PM IST
    Follow us on

    తెలంగాణలో సోదిలోనే లేని వామపక్షాలు ఇంత పకడ్బందీగా.. ధైర్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందడుగు వేస్తాయని.. ప్రధాన ప్రతిపక్షాలను తోసిరాజని ఏకంగా అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తాయని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఎన్నికలను ప్రకటించిన అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా గోచీ సర్దుకోలేదు. ఇక బీజేపీ ఇప్పుడే తేరుకుంది. కాంగ్రెస్ లో అసలు ఆ హడావుడే లేదు. జనసేనాని పవన్ అమరావతిలో ఉండి హైదరాబాద్ లో పోటీచేస్తామని ప్రకటించారు. వీళ్లంతా ఇంకా ప్రిపేర్ కాని పరిస్థితుల్లో వామపక్షాలు అన్నీ పార్టీలను ఆశ్చర్యపరుస్తూ తొలి జాబితా విడుదల చేయడం విశేషంగా మారింది.

    Also Read: జీహెచ్ఎంసీలో పోటీ.. పవన్ చేసిన పెద్ద తప్పు అదేనా?

    జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగడం.. తొలిరోజు నామినేషన్ల గడువు పూర్తి కావడం కూడా జరిగిపోయింది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పనులు పూర్తి చేసుకుంటుండగా అందరికంటే ముందే వామపక్షాలు తొట్టతొలి జాబితాను విడుదల చేయడం విశేషంగా మారింది.

    + వామపక్షాల తొలి జాబితా ఇదే..

    *సీపీఎం అభ్యర్థుల మొదటి జాబితా

    అడ్డగుట్ట 142వ డిజిజన్‌ – టి . స్వప్న
    రాంనగర్ 87వ డివిజన్‌ -ఎం. దశరథ్
    బాగ్ అంబర్‌పేట్‌ 54వ డివిజన్‌ – ఎం. వరలక్ష్మి
    చర్లపల్లి 3 డివిజన్‌ – పి . వెంకట్
    జంగమేట్ 45వ డివిజన్‌ – ఎ.కృష్ణ

    Also Read: దుబ్బాక ఓటమిని మైండ్ లోంచి తీసేయండి.. కేసీఆర్ హాట్ కామెంట్స్

    * సీపీఐ అభ్యర్థుల మొదటి జాబితా ఇదే..
    ఓల్డ్ మలక్‌పేట్‌ -ఫిరదౌజ్ ఫాతిమా
    లలిత బాగ్ – మహమ్మద్ ఆరిఫ్ ఖాన్
    ఉప్పుగూడ – సయెద్ అలీ
    హిమాయత్ నగర్ బి. చాయ దేవి
    షేక్‌పేట్ షైక్ షంషుద్దీన్ అహ్మద్
    తార్నాక – పద్మ

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈసారి వాపక్షాలు కలిసి పోటీచేస్తుండడం విశేసంగా మారింది. ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నట్టు సీపీఐ, సీపీఎం నాయకులు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డీజీ నర్సింహారావు తొలి విడత పోటీచేసే అభ్యర్థుల లిస్ట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్ ను ఓడించాలని.. ఈ ఐదేళ్లలో ప్రజా సమస్యలు తీర్చలేదని విమర్శించారు. దొంగచాటుగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వరద బాధితులకు సాయం చేయలేదని ఆరోపించారు. ప్రజలందరూ తమ పార్టీకి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.