అమావాస్య, పౌర్ణమికి మాత్రమే పవన్ రాజకీయాలు చేస్తాడు.. మిగతా రోజుల్లో కనిపించకుండా పోతాడనే విమర్శ ఏపీ రాజకీయాల్లో ఉంది. అందుకే అందరూ పవన్ ను ‘పార్ట్ టైం’ పొలిటీషియన్ అని పిలుస్తుంటారట.. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో ఓడిపోగానే పవన్ మళ్లీ సినిమాల బాట పట్టడంతో జనసేన పార్టీపై, పవన్ పై ప్రజల్లో ఇదే అభిప్రాయం ఏర్పడిందని అంటున్నారు. పవన్ రాజకీయంగా వేసే తప్పటడుగులే ఆయనకు పెను శాపం అవుతున్నాయన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించిన పవన్ తీరు చర్చనీయాంశమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వేళ పవన్ ఆంధ్రాలో ఉన్నారు. ఇక అమరావతి రైతులు, పార్టీ నేతలు, మహిళా రైతులతో భేటి అయ్యారు. నామినేషన్లకు కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో తెలంగాణలో ఉండి జనసేన నేతలు, కార్యకర్తలతో భేటి అయ్యి సీట్లు పంపిణీ చేసి వ్యూహం ఖరారు చేసి.. టికెట్లు ఇస్తే ఆ కిక్కే వేరు. దాన్ని పవన్ మరిచాడు. కనీసం ప్రచారానికైనా వస్తాడో.. తెలంగాణ జనసేన నేతలకు వదిలేస్తాడో అన్నది సందేహంగా మారింది. ఇవే పవన్ చేసిన పెద్ద మిస్టేక్స్ గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: జగన్ క్రిస్మస్ కానుక: ఏపీలో 30 లక్షలమందికి ఇళ్ల పట్టాలు
ఇప్పటికే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పొత్తు కోసం తమను ఎవరూ సంప్రదించలేదని చెప్పేశారు. ఇక పవన్ సైతం ఏపీ నుంచి జనసేన బరిలో ఉంటుందని తేల్చేశారు. దీంతో ఆంధ్రాలో భాగస్వాములు అయిన బీజేపీ-జనసేన తెలంగాణలో పోటీపడడం నేతలు, కార్యకర్తలను జీర్ణించుకునేలా చేయడం లేదట..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎన్నికల్లో పోటీని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి పవన్ ప్రకటించడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లు హైదరాబాద్ లో ఉన్న పవన్ అక్కడ నేతలకు దిశానిర్ధేశం చేసి సమరశంఖం పూరిస్తే మరింత ప్లస్ అయ్యేది. ఇప్పుడు ఆంధ్రా పార్టీ అన్న ముద్ర పడిపోయేలా పవన్ చేశారని.. తెలంగాణ జనసైనికులకు ఏం భరోసా ఇస్తారన్న టాక్ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
Also Read: టీఆర్ఎస్ కు వరద బాధితుల ముప్పు..!
జనసేనాని పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్యకర్తలు, నేతల కోరిక మేరకు పోటీచేస్తానని ప్రకటించారు. కానీ ఇక్కడే టైమింగ్ మిస్ అయ్యారని అంటున్నారు. ఒంటరిగా పోటీచేసేంత కార్యకర్తలు నేతల బలం జనసేనకు లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటప్పుడు రాజకీయ మిత్రుడు బీజేపీతో కలిస్తే కనీసం 10 సీట్లు అయినా పొత్తులో తీసుకొని పోటీచేస్తే మెరుగైన ఫలితం ఉండేది. దాన్ని కూడా పవన్ నెరవేర్చుకోలేక ఒంటరిగా బరిలోకి దిగుతాననడం పెద్ద తప్పుగా రాజకీయవర్గాలు అభివర్ణిస్తున్నాయి.ఇలా పవన్ కళ్యాణ్ సరైన టైమింగ్ చూసుకోకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలపై ముందుకు వెళుతున్నాడని పలువురు కౌంటర్ ఇస్తున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్