https://oktelugu.com/

యాక్షన్ అంటేనే భయపడుతున్న యాక్షన్ డైరెక్టర్ !

‘బోయపాటి’కి ఓవర్ యాక్షన్ నచ్చట్లేదు.. అవును.. యాక్షన్ అంటేనే బోయపాటి.. బోయపాటి అంటేనే యాక్షన్ అన్నట్టు సాగిన ఈ డైరెక్టర్ జర్నీ… ఇప్పుడు మాత్రం యాక్షన్ కి భయపడుతున్నాడు. మొత్తానికి బోయపాటి శ్రీనులో మార్పు వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’ ప్లాప్ దెబ్బకి గత రెండేళ్లుగా అవమానభారాలను మోస్తూ నలిగిపోతున్నాడు బోయపాటి. పైగా మరో సినిమా మొదలెట్టడానికి ఎప్పుడూ లేనిది చాల గ్యాపే తీసుకోవాల్సి వచ్చింది. సరే.. […]

Written By:
  • admin
  • , Updated On : November 18, 2020 / 07:09 PM IST
    Follow us on


    ‘బోయపాటి’కి ఓవర్ యాక్షన్ నచ్చట్లేదు.. అవును.. యాక్షన్ అంటేనే బోయపాటి.. బోయపాటి అంటేనే యాక్షన్ అన్నట్టు సాగిన ఈ డైరెక్టర్ జర్నీ… ఇప్పుడు మాత్రం యాక్షన్ కి భయపడుతున్నాడు. మొత్తానికి బోయపాటి శ్రీనులో మార్పు వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’ ప్లాప్ దెబ్బకి గత రెండేళ్లుగా అవమానభారాలను మోస్తూ నలిగిపోతున్నాడు బోయపాటి. పైగా మరో సినిమా మొదలెట్టడానికి ఎప్పుడూ లేనిది చాల గ్యాపే తీసుకోవాల్సి వచ్చింది. సరే.. గ్యాప్ తీసుకున్నా.. ఏ 100 కోట్ల హీరోతో సినిమా చేస్తున్నాడా అంటే.. అదీ లేదు. చివరికి నటసింహం బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నాడు.

    Also Read: స్టార్ డైరెక్టర్ కి వెబ్ సిరీస్ కూడా కష్టమేనా ?

    ఇక బాలయ్య – బోయపాటి సినిమా అంటేనే.. యాక్షన్ కి పీక్స్ అన్న రేంజ్ లో ఉంటుంది. ఫ్యాన్స్ కూడా అదే ఫిక్స్ అవుతారు. అయితే బోయపాటి మాత్రం ఈ సారి యాక్షన్ మోతాదును తగ్గించబోతున్నాడట. హీరో బాలయ్య అయినా ఓవర్ యాక్షన్ వద్దు అంటున్నాడట. అసలు బోయపాటి యాక్షన్ వద్దు అనడమే పెద్ద షాక్. కానీ బోయపాటిలో ఈ మార్పుకు కారణం.. భారీ యాక్షన్ మూవీ ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ అవ్వడమేనట. ఆ సినిమాలోని యాక్షన్ వాస్తవానికి మరి దూరంగా ఉండేసరికి.. బోయపాటిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ సినిమా చరణ్ కంటే కూడా.. బోయపాటికే ఎక్కువ బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది. అందుకే ఈ సారి అలాంటి తప్పు జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

    Also Read: ఓటీటీలో మరో రెండు సినిమాలు.. హిట్టయ్యేనా?

    అందులో భాగంగానే బాలయ్యతో చేయబోయే సినిమాలోనైనా యాక్షన్ ను కాస్త నమ్మే విధంగా రియలిస్టిక్ గా తీయాలని బోయపాటి తన టీం పదే పదే చెబుతున్నాడట. ఇప్పటికే బోయపాటి ఫైట్స్ విషయంలో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కు క్లారిటీ ఇచ్చాడు. ఓన్లీ రియలిస్టిక్ యాక్షన్ తోనే మనం ముందుకు వెళ్లదామని. అందుకే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఎప్పుడూ లేనిది కొత్తగా ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నారట. ఏది ఏమైనా బోయపాటిలో బాగా మార్పు వచ్చింది. ఇక ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఇంతకుముందు బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ, లెజెండ్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. మరి ఇప్పుడు చేయబోయే ఈ సినిమా కూడా హిట్ అయితే, వీళ్లిద్దరు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే. ఈ జంట హిట్ కొడతారా లేదా అనేది చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్