
Modi Vs KCR: నిండు కుండ ఎప్పుడూ తొలకదు.. వెలితి ఉన్న కుండలో నీళ్లే ఎగిరెగిరి పడతాయి. ప్రస్తుత రాజకీయాలు ఇలాగే ఉన్నాయి. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న ఆ ఇద్దరు నాయకుల్లో ఒకరు నిండుకుండలా ఉంటే.. మరో నేత వెలితి కుండలా ఎగిరెగిరి పడుతున్నాడు. డబ్బాలో గులకరాళ్లు వేసి ఊపినట్లు సౌండ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు నేతలు ఎవరో కాదు ఒకరు ప్రధాని నరేంద్ర మోదీ.. మరోకరు తెలంగాణ ముఖ్యమంత్రి, వచ్చే ఎన్నికల్లో మోదీని గద్దె దించుతానంటున్న కేసీఆర్. ఇద్దరూ రాజకీయ ఉద్దండులే కానీ, వారిమధ్య చాలా వ్యత్యాసం ఉంది.
Also Read: Amit Shah: కశ్మీర్ విషయంలో అమిత్ షా కమిట్ మెంట్‌కు ఈ ఘటన మచ్చుతునక!
పేరెత్తకుండానే మోదీ విమర్శలు..
మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, రెండుసార్లు దేశ ప్రధానికిగా పనిచేసిన మోదీ ఎవరినీ పేరు పెట్టి విమర్శించిన సందర్భం లేదు. వ్యక్తిగత విమర్శలకు ఆయన ఎప్పుడూ దూరంగానే ఉంటారు. దూషణలూ చేయరు. సైద్ధాంతికంగా, పాలసీ ప్రకారమే విమర్శలు చేస్తారు. అవి ఎవరికి తగలాలో వారికే తగులుతాయి. పార్లమెంటులో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా ఏ పార్టీ పేరు కూడా ఎత్తకుండా చురకలు అంటిస్తారు మోదీ. ఇటీవల రాహుల్‌గాంధీ లోక్‌సభలో మోదీ, అదానీ కలిసి ఉన్న ఫొటోలు కూడా ప్రదర్శిస్తూ విమర్శలు చేశారు. కేంద్రం గవర్నర్ల దుర్వినియోగం, రాష్ట్ర ప్రభుత్వాల కూల్చివేత తదితర అంశాలపైనా మోదీ ఆరోపణలు చేశారు. వీటన్నిటికీ మోదీ దీటుగా సమాధానం ఇచ్చారు. ఎక్కడా రాహుల్ పేరు కానీ, ఇతర విపక్ష నేతల పేరుకానీ ఎత్తలేదు. వ్యక్తి కేంద్రంగా విమర్శలు చేయడానికి మోదీ ఎప్పుడూ దూరంగానే ఉంటారు. వారసత్వ రాజకీయాలను మోదీ మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
వ్యక్తిగత ధూషణలకే కేసీఆర్ ప్రాధాన్యం..
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి చేసే విమర్శలు, ధూషణలు ఒక్కోసారి రాజకీయాలు ఇంత దిగజారాయా అన్నట్లు ఉంటాయి. చెవులు మూసుకోవాలనిపిస్తుంది. తనకు నచ్చని పార్టీని, వ్యక్తిని, నేతలను హోదాతో సంబంధం లేకుండా దూషించడం కేసీఆర్‌కే చెల్లుతుంది. బహుషా కేసీఆర్ దూషించినంతగా దేశంలో ఏ ముఖ్యమంత్రి గతంలోగానీ, భవిష్యత్‌లోగానీ విమర్శలు చేయరంటే అతిశయోక్తి కాదు, ప్రధాని అయినా, గవర్నర్ అయినా, ప్రతిపక్ష నేత అయినా, సొంతపార్టీ నేత అయినా ఎవరైనా కేసీఆర్‌కు ఒక్కటే. వయసుకు, హోదాకు కూడా కేసీఆర్ గౌవరవం ఇవ్వరు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోదీ టార్గెట్‌గానే విమర్శలు చేశారు. 2 గంటలు చేసిన ఆయన ప్రసంగంలో దాదాపు 20 నుంచి 30 సార్లు మోదీ పేరు ప్రస్తావించడమే ఇందుకు నిదర్శనం.

రాజకీయ నేతలు పరిణతితో ఉండాలి. మాట్లాడాలి. రాజ్యాంగ పదవులకు గౌరవం ఇవ్వాలి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి విషయంలో ఇవి వర్తించవు. ఇదే మోదీ, కేసీఆర్ మధ్య ఉన్న పెద్ద తేడా. కేసీఆర్ ఆయన వారసుడు కేటీఆర్ కూడా ఇటీవల దూషణల వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read:PM Modi Meets Actors: కేజీఎఫ్, కాంతారా హీరోలతో మోడీ స్కెచ్.. ప్రత్యర్థులకు నోట మాటరాదంతే!