Gujarat Flood: సోషల్ మీడియా వచ్చాక… ఇంటర్నెట్ చౌకగా అందుబాటులోకి వచ్చాక అందరూ తమ ఇష్టానుసారం సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. తమకు నచ్చిన పోస్టులు పెడుతూ లైక్‌లు, షేర్ల కోసం ప్రయత్నిస్తున్నారు. కొందరు వ్యక్తిగత విషయాలు, కొందరు హెల్త్ టిప్స్.. మరికొందరు తమలోని టాలెంట్‌ను బయట పెడుతున్నారు. వంటలు, డాన్సులు, ఫీల్లు చేసి పోస్టు చేస్తున్నారు. ఇక కొందరు అద్భుతమైన, ఆశ్చర్యకరమైన వీడియోలను పోస్టు చేస్తున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కొందరు సమాచారాన్ని నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు వ్యాపారులు కూడా తమ బిజినెస్‌ల గురించి ప్రమోట్ చేసుకుంటున్నారు. ఎవరికి వచ్చినట్లు వారు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇక అందరి అరచేతుల్లో ఆన్‌డ్రాయిడ్ ఫోన్లు ఉండడంతో నెటిజన్లు కూడా తమకు నచ్చినవాటిని లైక్ చేస్తున్నారు. షేర్ చేస్తున్నారు. కొన్ని పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గుజరాత్ కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతోంది. దీనిని నమ్మేలా లేదు. కానీ ఈ వీడియోను చూసినవారంతా తెగ ఆశ్చ్యపోతున్నారు.
స్కూటర్‌పై మొసలితో ప్రయాణం..
సాధారణంగా వర్షాలు, వరదలు వచ్చినప్పుడు చాలా మంది చేపల వేట సాగిస్తారు. తమకు సమీపంలోని చెరువులు, కుంటల వద్దకు వెళ్లి చేపలు పడతారు. అయితే ఇక్కడ ఇద్దరు యువకులు మాత్రం మొసలిని పట్టుకుని తీసుకెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. గుజరాత్‌లో పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదుల నుంచి మొసళ్లు బయటకు వస్తున్నాయి. జనం భయపడుతున్నారు. అయితే అదే గుజరాత్‌కు చెందిన ఇద్దరు యువకులు మొసలిని స్కూటర్‌పై తీసుకెళ్లడం చూఏసి ఆశ్చర్యపోతున్నారు. ఒకరు స్కూటర్ నడుపుతుండగా, మరొకరు ఆ భారీ మొసలిని ఒడిలో పెట్టుకుని కూర్చున్నారు. కుక్కలను, పిల్లులను ఇలా స్కూటర్పై ఎక్కించుకుని తీసుకుని వెళ్లడాన్ని ఎప్పుడో ఒకప్పుడు చూసేవుంటాం. కానీ ఇలా మొసలిని బండిపై తీసుకువెళ్లడాన్ని ఎప్పుడూ చూడలేదని ఈ వీడియో చూసినవారు వ్యాఖ్యానిస్తున్నారు.
కామెంట్స్ పెడుతున్న నెటిజన్స్..
ఈ వీడియోను @gharkekalesh ్ఛటజి అనే ఖాతా ద్వారా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియో క్యాప్షన్లో ’వడోదరలోని విశ్వామిత్ర నది నుంచి బయటకు వచ్చిన ఒక మొసలిని ఇద్దరు యువకులు స్కూటర్పై ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కార్యాలయానికి తీసుకెళ్లారు’ అని రాసివుంది. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ’ మొసలిని నీటిలో నుంచి బయటకు తీసి, దాని నోటిని తాడుతో కట్టేస్తే అది బలహీనపడిపోతుంది’ అని రాశారు. మరొక యూజర్ ’సోదరుని ధైర్యానికి వందనం’ అని రాయగా, ఇంకొకరు ’హెల్మెట్ లేకుండా స్కూటర్పై మొసలి ఎలా వెళుతుంది? అని రాశారు. ఇంకొందరు వాళ్లకు క్రొకొడైల్ ఫెస్టివల్ అని కామెంట్ చేశారు.
Two young men took a crocodile found in Vishwamitra river in Vadodara to the forest department office on a scooter
pic.twitter.com/IHp80V9ivP— Ghar Ke Kalesh (@gharkekalesh) September 1, 2024