Delhi Pollution: ప్రపంచంలో కాలుష్యం అంతకంతకు పెరిగిపోతోంది. దీంతో ప్రజల ప్రాణాలకు సైతం రక్షణ లేకుండా పోతోందని తెలుస్తోంది. పరిశ్రమల నుంచి వెలువడే ఊద్గారాలకు తోడు వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల వాయు కాలుష్యం ఎక్కువైపోతోంది. ఫలితంగా ప్రజలు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పర్యావరణ వేత్తలు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకునే వారే కరువయ్యారు.

ఢిల్లీ-ఎన్సీఆర్ లో పెరుగుతున్న కాలుష్యంపై ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ ప్రాంతంలో 86 శాతం కుటుంబాల్లో కాలుష్య భూతం కాటేస్తోందని తెలుస్తోంది. డిజిటల్ ప్లాట్ ఫారమ్ లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం కాలుష్య భూతం కోరలు చాస్తుందని వెల్లడిస్తోంది.
సుమారు 56 శాతం మందికి వాయు కాలుష్యంతో గొంతునొప్పి, కఫం, గొంతు బొంగురుపోవడం, కళ్ల మంటలు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో 25 వేల మంది అభిప్రాయాలు తెలుసుకున్నారు. దీని ఆధారంగా ప్రజల్లో కలుగుతున్న వ్యాధులపై ఓ నివేదిక రూపొందించారు.
ఢిల్లీలో మూడు రోజులు లాక్ డౌన్ విధించడంతో కాలుష్యం అదుపులోకి వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేసినా అందులో నిజం లేదని తెలుస్తోంది. దీనికి విరుగుడు అది కాదని సూచిస్తున్నారు. కాలుష్య కోరల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ఏ ప్రయత్నాలు చేస్తుందో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
Also Read: ఆ డ్యాంను బాంబులతో పేల్చేసిన ప్రభుత్వం.. షాకింగ్ కారణం