https://oktelugu.com/

Prabhas: బిగ్ బ్రేకింగ్ : రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి పై సంచలన అప్డేట్..పెళ్లి కూతురు ఎవరో చూస్తే షాక్ అవుతారు!

కృష్ణం రాజు చేసినప్పుడు జరుగుతుంది అని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చేవాడు. ఇప్పుడు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి బయటకి వచ్చినప్పుడు ఆమెకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రీసెంట్ గానే ఈమె ఇంద్ర కీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 8, 2024 / 12:47 PM IST

    Prabhas(4)

    Follow us on

    Prabhas: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో సల్మాన్ ఖాన్ తర్వాత 40 ఏళ్ళ వయస్సు దాటినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోని హీరోల లిస్ట్ తీస్తే అందులో రెబల్ స్టార్ ప్రభాస్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈయన అనుష్క తో డేటింగ్ చేస్తున్నాడని, కృతి సనన్ ని రహస్యం గా పెళ్లి చేసుకున్నాడని, ఇలా ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి. వాళ్ళు ప్రభాస్ కి నిజంగానే మంచి స్నేహితులని, వాళ్ళ మధ్య అంతకు మించి ఎలాంటి రిలేషన్ లేదని ఆ తర్వాత తెలిసింది. కానీ ‘డార్లింగ్’ సినిమా సమయంలో ప్రభాస్, కాజల్ కి మధ్య ప్రేమాయణం నడిచింది అనేది మాత్రం నిజమని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపించిన మాట. బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని అప్పట్లో కృష్ణం రాజు మీడియా ముందుకు వచ్చిన ప్రతీ సారీ అడిగేవారు.

    కృష్ణం రాజు చేసినప్పుడు జరుగుతుంది అని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చేవాడు. ఇప్పుడు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి బయటకి వచ్చినప్పుడు ఆమెకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రీసెంట్ గానే ఈమె ఇంద్ర కీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళింది. దర్శనం పూర్తి అయ్యాక ఆమె మీడియా తో కాసేపు ముచ్చటించారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని ఒక విలేఖరి అడగగా, దానికి ఆమె సమాధానం చెప్తూ ‘అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణాలు వచ్చేసాయి..అతి త్వరలోనే మీ మీడియా మిత్రులను పిలిచి ప్రభాస్ పెళ్ళికి సంబంధించిన శుభవార్తను తెలియచేస్తాము’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె చెప్పిన ఈ శుభ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. దసరా పండుగ కొత్త పనులు ప్రారంభించడానికి, శుభ కార్యాలు మొదలుపెట్టడానికి, శుభ వార్తలు చెప్పడానికి మంచి ముహూర్తం అని అందరూ అంటూ ఉంటారు. అంటే ఈ దసరాకే ప్రభాస్ పెళ్ళికి సంబంధించిన వార్తను చెప్పబోతున్నారా?, పెళ్లి కూతురు ఎవరు అనే దానిపై ఇప్పటి నుండే భారీ ఎత్తున సోషల్ మీడియా లో చర్చలు నడుస్తున్నాయి.

    అయితే పెళ్లి కూతురు మాత్రం ఇండస్ట్రీ కి సంబంధించిన అమ్మాయి కాదని స్పష్టంగా తెలుస్తుంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ సొంత ఊరు మొగళ్తూరు కి చెందిన అమ్మాయి అని తెలుస్తుంది. ప్రభాస్ కి బాగా దగ్గర బంధువుల అమ్మాయినే ఇచ్చి చేస్తున్నారట. వాస్తవానికి ఈ సంబంధం ఎప్పుడో ఫిక్స్ అయ్యిందని, కానీ ప్రభాస్ కి ఉన్నటువంటి సినిమాల కమిట్మెంట్స్ కారణంగా ఈ పెళ్లిని వాయిదా వేశారని తెలుస్తుంది. ఈ ఏడాది కల్కి చిత్రం తో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి చరిత్ర తిరగరాసిన ప్రభాస్, ప్రస్తుతం ‘రాజా సాబ్’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.