https://oktelugu.com/

తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలదే హవా

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా నడుస్తోంది. తెలంగాణలోని ఏకైన నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ కురువృద్ధుడైన జానారెడ్డి మ్యాజిక్ కుర్రకుంక అయిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ముందు పనిచేయడం లేదు. ఇక ఏపీలోని తిరుపతిలో అందరూ ఊహించినట్టే వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే ఇక్కడ టీడీపీ కూడా మంచి ఓట్లు సాధిస్తోంది. నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ తన సీనియర్ కాంగ్రెస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 2, 2021 / 10:29 AM IST
    Follow us on

    తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా నడుస్తోంది. తెలంగాణలోని ఏకైన నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ కురువృద్ధుడైన జానారెడ్డి మ్యాజిక్ కుర్రకుంక అయిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ముందు పనిచేయడం లేదు. ఇక ఏపీలోని తిరుపతిలో అందరూ ఊహించినట్టే వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే ఇక్కడ టీడీపీ కూడా మంచి ఓట్లు సాధిస్తోంది.

    నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ తన సీనియర్ కాంగ్రెస్ ప్రత్యర్థి జానారెడ్డిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సాగర్ లో 27513 ఓట్లు రాగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి 20528 ఓట్లు సాధించారు. బీజేపీకి కేవలం 957 ఓట్లు వచ్చాయి. దాదాపు 6వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ సాగర్ లో దూసుకుపోతోంది.

    ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ముందంజలో ఉంది. వైసీపీకి 62029 ఓట్లు రాగా.. ప్రతిపక్షం టీడీపీ 32669 ఓట్లు వచ్చాయి. దాదాపు 22వేల ఓట్ల మెజార్టీతో వైసీపీ దూసుకుపోతోంది.బీజేపీకి కేవలం 4936 ఓట్లు మాత్రమే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రెండు ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీలకే ప్రజలు పట్టంకట్టారని తెలుస్తోంది.