https://oktelugu.com/

PM Internship Scheme : జాబ్‌ లేనివారికి గుడ్‌ న్యూస్‌.. నెలకు రూ.5000.. నేటి నుంచి ప్రారంభం..

దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ప్రైవేటు సెక్టార్‌లో కావాల్సిన నైపుణ్యం లేక ఉద్యోగాలు దొరకడం లేదు. అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త స్కీం ప్రారంభించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 2, 2024 / 10:03 AM IST

    PM Internship Scheme

    Follow us on

    PM Internship Scheme : దేశంలో జాబ్‌ లేని నిరుద్యోగుల్లో నైపుణ్యం పెంచేందుకు కేంద్రం కొత్త ప్రథకం తీసుకువచ్చింది. పీఎం ఇంటర్న్‌షిప్‌ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. 20224–25 బడ్జెట్‌లో ఇందుకు నిధులు కూడా కేటాయించింది. ఈ పథకంలో భాగండా డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.5 వేలు, వన్‌టైం గ్రాంట్‌ కింద రూ.6 వేలు కేంద్రం అందిస్తుంది.

    280 కంపెనీలు..
    ఇంటర్న్‌షిప్‌ కూడా ప్రముఖ కంపెనీల్లో పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇందు కోసం 280 కంపెనీలను ఎంపిక చేసింది. ఈ కంపెనీల్లో 1, 27,046 మంది యువత ఇంటర్న్‌షిప్‌ పొందే అవకాశం అందుబాటులోకి తెచ్చింది. విద్యాభ్యాసం అర్హత ఆధారంగా ఎందులో ఇంటర్న్‌షిప్‌ ఇవ్వాలనేది నిర్ణయిస్తారు.

    ముగిసిన దరఖాస్తు గడువు..
    పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకం ద్వారా అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకునే ప్రక్రియ గత అక్టోబర్‌ 12న ప్రారంభమైంది. అక్టోబర్‌ 25 వరకు నమోదుకు అవకాశం కల్పించారు. అక్టోబర్‌ 27వ తేదీ నుంచి నవంబర్‌ 7వ తేదీ వరకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపిక అయిన అభ్యర్థులకు సమాచారం అందించారు. వారు ఏ కంపెనీలో ఇంటర్న్‌ఫిప్‌ పొందుతారు అనే వివారలు మెస్సేజ్‌ రూపంలో పంపించారు. ఇంటర్న్‌షిప్‌లో బ్యాంకింగ్‌ అండ్‌ ఫినాన్షియల్‌ స్వీసెస్, సిమెంట్‌ అండ్‌ బిల్డింగ్‌ మెటీరియల్స్, కెమికల్‌ ఇండస్ట్రీ, టాటా, రిలయన్స్, ఏషియన్‌ పెయింట్స్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్స్‌టైల్, టెలికాం, మహీంద్ర, హీరో వంటి కంపెనీలు ఇంటర్న్‌షిప్‌లో భాగస్వామి అయ్యాయి. ఇందు కోసం కేంద్రం రూ.800 కోట్లు కేటాయించింది.

    నేడు ప్రారంభం…
    పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ సోమవారం(డిసెంబర్‌ 2న) లాంఛనంగా ప్రారంభించనున్నారు. నవంబర్‌ 30 వరకు అభ్యర్థులు ఆయా కంపెనీల్లో జాయిన్‌ అయిన నేపథ్యంలో పథకం ప్రారంభించి ఎంపికైన అభ్యర్థుల ఖాతాల్లో వన్‌టైన్‌ సెటిల్‌మెంట్‌ కింద రూ.6 వేలు జమ చేస్తారు. తర్వాత నెల నుంచి రూ.5 వేల చొప్పున అభ్యర్థుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి.