Homeజాతీయ వార్తలుLithium: మోదీ సర్కార్‌ సంచలన నిర్ణయం..!

Lithium: మోదీ సర్కార్‌ సంచలన నిర్ణయం..!

Lithium: దేశంలో సహజ వనరులను గుర్తించేందుకు కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్రమోదీ దేశ వ్యాప్తంగా సర్వే చేయించారు. పలు రాష్ట్రాల్లో సహజ వనరుల గుర్తింపు సర్వే చేపట్టారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, రాజస్థాన్‌తోపాటు జమ్ముకశ్మీర్‌లోనూ ఈ సర్వే నిర్వహించారు.

కశ్మీర్‌లో అరుదైన ఖనిజం..
సర్వేలో భాగంగా భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో అత్యంత అరుదైన లిథియం నిల్వలను గుర్తించారు. రియాసి జిల్లాలో సుమారు 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు భారత భూగర్భ పరిశోధన సంస్థ(జీఎస్‌ఐ) కొనుగొంది. గతంలో భారత్‌లో లిథియం నిల్వలు లేవు. అవసరాల కోసం విదేశాల నుంచే దిగుమతి చేసుకునేది. కానీ ప్రస్తుతం కశ్మీర్‌లో సాధారణ లిథియం220 పీపీఎం(పార్‌ట్స పర్‌ మిలియన్‌)గా ఉంటుంది. కశ్మీర్‌లో గుర్తించిన లిథియం మాత్రం 500 పీపీఎం ప్లస్‌గా ఉంది. దీనికి విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉన్నట్లు సమాచారం. లిథియం నిల్వల లభ్యతతో మన దేశం చైనాను మించి పోతుందని కేంద్రం భావిస్తోంది.

వేలానికి ఏర్పాట్లు..
ఇక కశ్మీర్‌లో లభించిన లిథియం నిల్వలను వేలం వేయాలని కేంద్రం భావిస్తోంది. ఈమేరకు ఏర్పాట్ల చేయాలని ప్రధాని నరేంద్రమోదీ అధికారులను ఆదేశించారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని కేంద్రం భావిస్తోంది. మొదటి రౌండ్‌ వేలం ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుందో అంచనా వేస్తున్నారు. పీపీఎం ఆధారంగా విలువను నిర్ధారించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

వెలికి తీతకు భారీగా ఖర్చు..
ఇదిలా ఉంటే లిథియం నిల్వలు వెలికి తీయడానికి భారీగా ఖర్చవుతుందనరి అధికారులు అంచనా వేశారు. టన్ను ముడి లిథియం తవ్వకానికి 78,032 అమెరికన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.64 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీని ఆధారంగా లిథియం టెండర్లు పిలిచే అవకాశం ఉంది.

ఎలక్ట్రానిక్స్‌ పరికరాల్లో..
ఇక లిథియంను అన్ని ఎలక్ట్రానిక్స్‌ పరికరాల్లో వాడుతున్నారు. లిథియం ఉత్పత్తి ఎగుమతుల్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా, చిలీ, చైనా అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రంగంలో ఈ మూడు దేశాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. తాజాగా భారత్‌తో ఈ నిక్షేపాలు బయటపడడంతో భారత్‌ కూడా రంగంలోకి దిగింది. వేలం ద్వారా ప్రపంచ దేశాలను శాసించే దిశగా చర్యలు చేపట్టింది. లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వీ వాహనాల తయారీ పెరుగుతున్న నేపథ్యంలో లిథియం లభించడం భారత్‌కు సువర్ణ అవకాశం అని నిపుణులు పేర్కొంటున్నారు.

తగ్టనున్న ఈవీల ధరలు..
లిథియం ఉత్పత్తి ప్రారంభిస్తే మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, డిజిటల్‌ కెమెరాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలు(ఈవీ)ల్లో వాడే రీచ్జాబుల్‌ బ్యాటరీలు, పేస్‌మేకర్‌ యంత్రాలు, బొమ్మలు, గడియారాల్లో వాడే నాన్‌ రీచ్జాబుల్‌ బ్యాటరీల తయారీ ధరలు తగ్గుతాయి. దీంతో ఆయా పరికరాల ధరలు కూడా తగ్గుతాయనినిపుణులు అంచనా వేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular