Harsh Goenka: దోశె వేయడం కూడా ఓ వ్యక్తిత్వ పాఠమే.. మిలియనీర్ చెబుతున్న ఆ కథేమిటో మీరూ చదివేయండి..

ముంబై మహానగరంలో ఓ వ్యక్తి ఫ్లయింగ్ దోశె వేయడంలో ఎక్స్ పర్ట్. అతని వద్ద దోశెలు తినడానికి పెద్ద సెలబ్రిటీలు వస్తుంటారు. అలా కొంతమంది ఔత్సాహికులు అతడు దోశె వేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 7, 2024 2:29 pm

Harsh Goenka

Follow us on

Harsh Goenka: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక రకాల వీడియోలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వీడియోల ద్వారా సామాన్యుల ప్రతిభ వెలుగులోకి వస్తోంది. వారి ప్రతిభ అసాధారణంగా ఉండడంతో సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఆశ్చర్యకరమైన వీడియోలను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా(Harsh Goenka) తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుంటారు. అలా ఆయన షేర్ చేసిన వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నది.

ముంబై మహానగరంలో ఓ వ్యక్తి ఫ్లయింగ్ దోశె వేయడంలో ఎక్స్ పర్ట్. అతని వద్ద దోశెలు తినడానికి పెద్ద సెలబ్రిటీలు వస్తుంటారు. అలా కొంతమంది ఔత్సాహికులు అతడు దోశె వేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఇది హర్ష్ గోయెంకా ను విపరీతంగా ఆకట్టుకున్నది. ఇంకేముంది తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. హర్ష్ గోయెంకా షేర్ చేసిన వీడియో ప్రకారం అందులో ఉన్న వ్యక్తి ఎంతో సులువుగా ఫ్లయింగ్ దోశెలు వేస్తున్నాడు. అంతే వేగంగా ప్లేట్లలోకి విసిరేస్తున్నాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి వాటిని అదే స్పీడ్ లో క్యాచ్ అందుకుంటున్నాడు. కస్టమర్లకు అందిస్తున్నాడు.. వీరి టాలెంట్ చూసేందుకు అక్కడికి వచ్చే వారంతా.. దోశెలు తింటూ.. వారి వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్నారు.

ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియో హర్ష్ గోయెంకా దృష్టిని ఆకర్షించింది.. వెంటనే ఆ వీడియోను ఆయన షేర్ చేసి.. “పని దైవం అనే భావించే వాళ్లకు ఈ వీడియో బాగా నచ్చుతుంది. మీరు ఎలాంటి పని చేసినా .. మీ స్టైల్ మాత్రం మిస్ అవ్వద్దు.. ఇది ఒక వ్యక్తిత్వ పాఠం. పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో చెప్పరు. కేవలం అనుభవం ద్వారానే నేర్చుకోవాలని” హర్ష్ గోయెంకా రాస్కొచ్చాడు. అయితే ఈ వీడియో లక్షల కొద్దీ వ్యూస్ నమోదు చేసుకుంది. “ఇదంతా ఈజీ కాదు.. దోశె వేస్తున్న వ్యక్తి ఆయన స్టైల్ లో చేస్తున్నాడు. కానీ క్యాచ్ పట్టుకునే వ్యక్తికి టాలెంట్ ఎక్కువగా ఉంది. ఒక్కటి కూడా మిస్ అవ్వడం లేదు. ఫుడ్ విత్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇదే కావచ్చు. చాలామంది రజనీకాంత్ ఆటిట్యూడ్ ను అనుసరిస్తున్నారు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.