Brahmastra Pre-Release Event: తెలంగాణలో సినీ పొలిటికల్ గేమ్ మొదలైంది. రాజకీయ లబ్ధి కోసం ఏ అంశాన్నీ టీఆర్‌ఎస్, బీజేపీ వదలడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా కమల దళానికి మరో ‘బ్రహ్మాస్త్రం’ దొరికింది. పాన్ ఇండియా మూవీగా ఈనెల 9న విడుదల కానున్న బ్రహ్మాస్త్రం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 2న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించాలని సినిమా యూనిట్ నిర్ణయించింది. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు కూడా చేసింది. కానీ చివరి నిమిషంలో ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా పాల్గొనాల్సిన సభకు పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి క్యాన్సిల్ చేశారు తెలంగాణ పోలీసులు. ఇప్పుడు ఇది రాజకీయం రంగు పులుముకుంటోంది. జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యే ఈ కార్యక్రమానికి కావాలనే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని బీజేపీ ప్రచారం మొదలు పెట్టింది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలసినందుకే టీఆర్‌ఎస్ సర్కార్ ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆరోపిస్తోంది.

-సినిమా నేపథ్యం…
బ్రహ్మాస్త్రం భారీ బడ్జెట్‌తో రూపొందించారు. బాలీవుడ్‌లో అంత్యంత ఖరీదైన ప్రొడక్షన్ సినిమాగా రూపొందించింది. సుమారు రూ.410 కోట్లతో సినిమా తీసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఐదేళ్లు గడిచింది. అమితాబచ్చన్, అక్కినేని నాగార్జున ఇందులో నటిస్తున్నారు. తెలుగులో దీనిని ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పిస్తున్నారు. నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర ధారి. భారీ విజువల్ ఎఫెక్ట్‌తో దీనిని తీశారు. సినిమా ఖర్చుకు పబ్లిసిటీ ఖర్చు అదనం. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు నిర్మాతలు జూనియర్ ఎన్టీఆర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే చివరి నిమిషంలో కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Also Read: Chandrababu: రిజర్వుడ్ స్థానాలపై చంద్రబాబు ఫోకస్.. ముందుగానే అభ్యర్థులు ఫిక్స్
-వినాయక చవితి నేపథ్యంలోనే..
వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నందున సినిమా ఫంక్షనకు పోలీస్ భద్రత కల్పించలేమని, అందుకే కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం లేదని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. వాస్తవానికి బహిరంగ ప్రదేశంలో నిర్వహించే ఈవెంట్‌కు అయితే భారీగా పోలీసు భద్రత కావాలి. కానీ రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించే వేడుకకు భారీ భద్రత అవసరం లేదని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. హిందూ బ్యాంక్‌గ్రౌండ్‌లో వస్తున్న సినిమా కాబట్టే తెలంగాణ ప్రభుత్వం కావాలనే ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అనుమతి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు.
-మునావర్‌కు భారీ భద్రత ఎలా..
ఇటీవల కమెడియన్ మునావర్ ఫారూక్‌తో హైదరాబాద్‌లో నిర్వహించిన కామెడీ షోకు తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రత కల్పించింది. బీజేపీ దీనిని వ్యతిరేకించిన నేపథ్యంలో సర్కార్ బందోబస్తు నడుమ కార్యక్రమం నిర్వహించింది. దీని తర్వాత రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రం, ప్యాన్ ఇండియా మూవీకి భద్రత కల్పించకపోవడంపై బీజేపీ విమర్శనాస్త్రాలు సందిస్తోంది.

-భారీ తారాగణం వచ్చే కార్యక్రమం..
ఒక్క మునావర్ ఫారూఖీకి వేల మంది పోలీసులతో భద్రత కల్పించి భారీ సినీతారాగణం హాజరయ్యే బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు భద్రత కల్పించలేమని చేతులెత్తేయండంపై సినిమా అభిమానులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ అమిత్‌షాను కలిశాడన్న కారణంగా ఆయన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రీరిలీజ్‌ను అడ్డుకున్నంత మాత్రాన సినిమా ప్రదర్శన ఆగదన్న వాదన కూడా వినిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమాను అడ్డుకుంటామని ఎక్కడా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో రాజకీయాలతో సినీ నటులకు ఉన్న అనుబంధం, సత్సంబంధాలు సినిమాలపై ప్రభావం చూపడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అదే నిజమైతే అసలు సిసలు పొలిటికల్ వార్ మళ్లీ తెలంగాణలో మొదలైనట్లే. గతంలో రామోజీ ఫిలిం సిటీ మీద కేసీఆర్ కారాలు మిరియాలు నూరారు. రాచకొండ గుట్టల్లో ఫిలిం సిటీ కడతామని ప్రకటించారు కూడా. కానీ దాన్ని వదిలేసి రామోజీతో దోస్తీ కట్టారు. ఇప్పుడాయన అమిత్ షాతో సాన్నిహిత్యంగా ఉండడంతో తట్టుకోలేక ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
Also Read:Modi-KTR: మోడీతో ఫైట్: బస్తీమే సవాల్ అంటూ ఆయన సవాల్ స్వీకరించిన కేటీఆర్
[…] […]