Homeక్రీడలుAsia Cup Super 4 schedule: ఆసియాకప్: ఈ సండే మళ్లీ ఇండియా-పాక్ బిగ్ ఫైట్.....

Asia Cup Super 4 schedule: ఆసియాకప్: ఈ సండే మళ్లీ ఇండియా-పాక్ బిగ్ ఫైట్.. సూపర్ 4 షెడ్యూల్ ఇదే

Asia Cup Super 4 schedule: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరికి ఒకటే సందడి ఉంటుంది. ఎన్ని పనులు ఉన్నా వదులుకుని మ్యాచ్ చూడటం తెలిసిందే. ఏ దేశంతో ఆడినా అంత క్రేజీ ఉండదు. ఒక్క పాక్ తోనే ఆడితేనే మ్యాచ్ లో మజా వస్తుంది. అభిమానుల్లో జోష్ పెరుగుతుంది. బాల్ బాల్ కు ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరుగుతుంది. టీవీలకే అతుక్కుపోయి మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తారు. రెండు దేశాల మధ్య నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా కొద్ది కాలంగా ఆటలు లేకపోవడంతో అభిమానులకు బోరు కొట్టడం మామూలే.

Asia Cup Super 4 schedule
hardik pandya

కానీ ఆసియా కప్ పుణ్యమాని ఆ లోటు తీరుతోంది. రెండు దేశాల మధ్య ఇదివరకే ఓ మ్యాచ్ జరగగా మళ్లీ ఆ సందడి ప్రేక్షకుల ముందు కదలాడనుంది.

Also Read: Ileana: ఇలియానాని నలిపేసిన స్టార్ డైరెక్టర్.. వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఇంతకీ ఎవరు ఆ డైరెక్టర్ ?

ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ 4న మరోమారు ఇండియా, పాక్ తలపడనున్నాయి. దీంతో అభిమానులకు పండుగ కానుంది. వారం రోజుల వ్యవధిలో రెండు మార్లు ఢీకొనడంతో ఇక ప్రేక్షకుల సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి. హాంకాంగ్ పై విజయంతో పాకిస్తాన్ సూపర్ ఫోర్ లోకి అడుగుపెట్టింది.

గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్ లను ఓడించి అఫ్గనిస్తాన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. గ్రూప్ ఎ నుంచి పాకిస్తాన్, హాంకాంగ్ లను ఓడించి గ్రూప్ ఫోర్ లో ప్రవేశించిన సంగతి తెలిసిందే.

Asia Cup Super 4 schedule
Asia Cup Super 4 schedule

గ్రూప్ బి నుంచి శ్రీలంకను బంగ్లాదేశ్ ఓడించింది. సూపర్ ఫోర్ కోసం అఫ్గనిస్తాన్ తో శ్రీలంక అమీతుమీ తేల్చుకోనుంది. సూపర్ ఫోర్ మ్యాచ్ లు ప్రేక్షకులకు సందడి చేయనున్నాయి. మొదటి మ్యాచ్ లో శ్రీలంక, అఫ్గనిస్తాన్ ఆడనున్నాయి. భారత్, పాక్ మ్యాచ్ రేపు జరుగుతున్నందున సర్వత్రా ఆసక్తి కలుగుతోంది.

ఆసియా కప్ సూపర్ ఫోర్ షెడ్యూల్ లో భాగంగా శ్రీలం, అఫ్గనిస్తాన్ మ్యాచ్ షార్జాలో సెప్టెంబర్ 3న, భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 4న దుబాయ్ లో, భారత్, శ్రీలంక మ్యాచ్ దుబాయ్ లో సెప్టెంబర్ 7న, అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 8న దుబాయ్ లో , భారత్, అఫ్గనిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 8న దుబాయ్ లో, శ్రీలంక, పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ లో సెప్టెంబర్ 9న జరగనుంది. దీంతో మ్యాచ్ లను తిలకించేందుకు అభిమానులు ఆతృతగా ఉన్నారు. దీంతో ఆసియా కప్ నిర్వహణలో భాగంగా జరిగే మ్యాచ్ లు ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి.

Also Read: Brahmastra Pre-Release Event: టీఆర్ఎస్ పై ‘బ్రహ్మాస్త్రం’ ప్రయోగిస్తున్న బీజేపీ

 

 

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular