Viral Video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదై పోయింది. ఎక్కడ ఏ ఘటన జరిగినా క్షణాల్లో అందులో ప్రత్యక్షం అవుతుంది. టీవీల కంటే ముందుగానే ఫోన్లలో ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు వస్తున్నాయి. అంతే కాకుండా వింత వింత ఘటనలు, విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యానికి, షాక్ కు గురి చేస్తుంటాయి. వీటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. రద్దీగా ఉన్న జనం మధ్యలోకి చొచ్చుకొచ్చే జంతువులు.. కొన్నిసార్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అకస్మాత్తుగా బస్సులోకి దూరిన ఓ ఎద్దు.. చివరకు ఏం చేసిందో ఈ వీడియోలో చూసేయండి.
Bull enters inside a moving bus in Jaipur!pic.twitter.com/v3sK0KMAip
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 12, 2025
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ ఘటన జైపూర్‌లో జరిగినట్లు తెలుస్తుంది. బస్సులోని ప్రయాణికులంతా వారి వారి ఫోన్లలో బిజీగా ఉన్నారు. ఈ సమయంలోనే ఉన్నట్లుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందే ఏమో తెలీదు గానీ.. ఓ ఎద్దు బస్సు సమీపంలోకి వచ్చింది. ఆ సమయంలో ప్రయాణికులంతా ఎవరి లోకాల్లో వారున్నారు. ఇంతలో ఆ ఎద్దు సడన్‌గా లోపలికి దూరిపోయింది. అంతవరకూ ఎద్దును ఎవరూ గమనించలేదు. తీరా బస్సు లోపలికి దూరడంతో అంతా అవాక్కయ్యారు. భయంతో వణికిపోయారు. బయటికి వెళ్లేందుకు అవకాశం లేకుండా ఎద్దు.. బీభత్సం సృష్టించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అంతా ఎక్కడికక్కడ బస్సుకు ఉన్న అద్దాలను పగులగొట్టుకుని బయటికి దూకేశారు. ఎద్దు బస్సులో అటూ, ఇటూ తిరడంతో బస్సు ధ్వంసం అయింది.. ఎద్దు ఎక్కడ తమ మీదకు దూకేస్తుందో అనే భయంతో ప్రయాణికులు అంతా అటూ, ఇటూ పరుగులు తీశారు.
బస్సు డ్రైవర్ ఎక్కే కిటికీ గుండా మిగిలిన వారు కూడా కిందకు దూకేశారు. ఈ ఘటనతో స్థానికులు అక్కడ గుమికూడారు. కొందరు కలుగజేసుకుని బస్సులోని ఎద్దును కిందకు దింపేశారు. దీంతో అంతా.. హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘‘బస్సులోకి ఎద్దు వస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోకపోవడం దారుణం’’.. అంటూ కొంతమంది.. ‘‘ఈ ఎద్దుకు బస్సు జర్నీ అంటే బాగా ఇష్టమున్నట్లుంది’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.