https://oktelugu.com/

JNTU Campus: క్యాంపస్ లో శోభనం.. యూనివర్సిటీలో ప్రొఫెసర్ హనీమూన్

Kakinada JNTU Campus: చదువులమ్మ ఒడిని శోభనం గదిగా మార్చిన సంఘటన కాకినాడలో వెలుగుచూసింది. జేఎన్ టీయూ క్యాంపస్ ను(JNTU Campus) బెడ్ రూంగా మార్చడంతో అందరిలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. సరస్వతీ నిలయంలో ఇలాంటి పాడు పనులు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. క్యాంపస్ సిబ్బందిపై విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. విశ్వవిద్యాలయం అతిథి గృహాన్ని హనీమూన్ సెంటర్ గా మార్చడంతో అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పవిత్రంగా చూసుకోవాల్సిన నిలయాన్ని అపవిత్రంగా తయారు చేయడం […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 21, 2021 / 06:56 PM IST
    Follow us on

    Kakinada JNTU Campus: చదువులమ్మ ఒడిని శోభనం గదిగా మార్చిన సంఘటన కాకినాడలో వెలుగుచూసింది. జేఎన్ టీయూ క్యాంపస్ ను(JNTU Campus) బెడ్ రూంగా మార్చడంతో అందరిలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. సరస్వతీ నిలయంలో ఇలాంటి పాడు పనులు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. క్యాంపస్ సిబ్బందిపై విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. విశ్వవిద్యాలయం అతిథి గృహాన్ని హనీమూన్ సెంటర్ గా మార్చడంతో అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పవిత్రంగా చూసుకోవాల్సిన నిలయాన్ని అపవిత్రంగా తయారు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

    కాకినాడ జేఎన్టీయూ గెస్ట్ హౌస్ లో ఆగస్టు 18 రాత్రి నూతన దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. ఆగస్టు 18న ఉమెన్ ఎంపవర్ మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ.స్వర్ణకుమారి గెస్ట్ హౌస్ లో మూడు గదులను బుక్ చేసుకున్నారు. అందులో 201 గదిలో దంపతులకు అట్టహాసంగా శోభనం ఏర్పాటు చేశారు. వేడుకలకు గెస్ట్ హౌస్ వాడకూడదనే నిబంధనలు ఉన్నా పట్టించుకోలేదు. ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని తెలిసినా అధికారుల నిర్లక్ష్యంతో ఇలా బుక్ చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

    క్యాంపస్ ఏమైనా అత్తవారిల్లా అని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మూడు గదులను బుక్ చేసుకుని ఒక గదిలో శోభనం, మరో రెండు గదుల్లో పెళ్లి వేడుకలు నిర్వహించినట్లు తెలుస్తోంది. వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పేరుతో గదులు బుక్ చేసినా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో సిబ్బంది నిర్లక్ష్యం క నిపిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    యూనివర్సిటీ వ్యవహారాల నిమిత్తం వచ్చే అధికారులు, సిబ్బందికి ఈ గదులను అద్దెకు ఇస్తుంటారు. అంతేకానీ ఇక్కడ ప్రైవేటు కార్యకలాపాలకు తావు లేదు. ప్రైవేటు కార్యక్రమం కోసం అదీ కూడా శోభనం కోసం ఉపయోగించుకోవడం ఏమిటని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతి ఇచ్చిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.