https://oktelugu.com/

ట్విస్ట్: ప్రియురాలు పిలిచిందని అర్ధరాత్రి వెళ్లిన ప్రియుడు

ప్రియురాలి పిలిచిందని సొల్లు కార్చుకుంటూ అర్ధరాత్రి వెళ్లిన ప్రియుడికి ఊహించని అనుభవం ఎదురైంది. గాఢంగా ప్రేమించిన అమ్మాయిని అనుభవించేద్దామని చూసిన ప్రియుడు ఆబగా వెళ్లాడు. బయట కలుసుకొని ముద్దూ ముచ్చట మాత్రమేతీర్చుకున్న ఈ జంట ఇక ఆ కార్యం కోసం ఆబగా ఎదురుచూశారు. ఓ రోజు అర్ధరాత్రి ప్రియురాలు ప్రియుడికి ఫోన్ చేసింది.. తన ఇంట్లో ఎవరూ లేరని తన దగ్గరికి రావాలని చెప్పింది..రెట్టించిన ఉత్సాహంతో సెంట్ కొట్టుకొని మరీ ఆనందంతో ఆ ప్రియుడు వెంటనే ప్రియురాలి […]

Written By:
  • NARESH
  • , Updated On : May 30, 2021 / 12:18 PM IST
    Follow us on

    ప్రియురాలి పిలిచిందని సొల్లు కార్చుకుంటూ అర్ధరాత్రి వెళ్లిన ప్రియుడికి ఊహించని అనుభవం ఎదురైంది. గాఢంగా ప్రేమించిన అమ్మాయిని అనుభవించేద్దామని చూసిన ప్రియుడు ఆబగా వెళ్లాడు. బయట కలుసుకొని ముద్దూ ముచ్చట మాత్రమేతీర్చుకున్న ఈ జంట ఇక ఆ కార్యం కోసం ఆబగా ఎదురుచూశారు. ఓ రోజు అర్ధరాత్రి ప్రియురాలు ప్రియుడికి ఫోన్ చేసింది.. తన ఇంట్లో ఎవరూ లేరని తన దగ్గరికి రావాలని చెప్పింది..రెట్టించిన ఉత్సాహంతో సెంట్ కొట్టుకొని మరీ ఆనందంతో ఆ ప్రియుడు వెంటనే ప్రియురాలి ఇంట్లో వాలిపోయాడు. సరదాగా మాటలతో మొదలుపెట్టాడు. ముద్దులు, కౌగిలింతులు.. పని స్ట్రాట్ చేసే లోపు ప్రియురాలు తండ్రి అక్కడికి వచ్చాడు. తన కూతురు గదిలో మగ గొంతుని విని తలుపు తీశాడు.. అంతే కూతురు ప్రియుడితో కలిసి ఉండడం చూశాడు.

    ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుండ గ్రామానికి చెందిన ధనశేఖర్, అదే గ్రామానికి చెందిన ఓ యువతి గాఢంగా ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా అప్పుడప్పుడూ కలుసుకునేవారు. ఏడాదిగా వీరు కలిసిమెలిసి తిరుగుతున్నారు. అలాగే ఈనెల 22న అర్ధరాత్రి ప్రియురాలి ఇంట్లో వీరిద్దరు కలుసుకొని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో వ్యవసాయ పనులకు వెళ్లిన ప్రియురాలి తండ్రి ఇంటికి వచ్చాడు. తన కూతురు గదిలో మగ గొంతు వినిపించడంతో తలుపు తీశాడు. తన కూతురుతో కలిసున్న ధనశేఖర్ ను చూశాడు.

    వెంటనే కోపంతో ఊగిపోయిన తండ్రి కూతురుని మందలించి తల్లి గదిలోకి పంపించాడు. ఆ తరువాత ప్రియుడు ధనశేఖర్ ను బయటికి తీసుకెళ్లాడు. అయితే రెండు రోజులుగా ధనశేఖర్ ఇంటికి రాలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ జరిపించి ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చారు.

    22న అర్ధరాత్రి తన కూతురు గదిలో చూసిన ప్రియుడు ధనశేఖర్ ను చూసిన ఆమె తండ్రి బయటికి తీసుకెళ్లాడు. పెద్ద కర్ర తీసుకొని ధనశేఖర్ తలపై బలంగా కొట్టాడు. రెండు రోజుల తరువాత మృతదేహం బావిలో తేలడంతో దానిని ముక్కలు ముక్కులుగా కోసి పూడ్చిపెట్టినట్లు ప్రియురాలి తండ్రి బాబు పోలీసుల వద్ద తెలిపాడు. దీంతో హత్య కేసు నమోదు చేసిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే ధనశేఖర్ హత్యలో ప్రియురాలితో పాటు తల్లిపై కూడా పోలీసులు కేసులు పెట్టి విచారణ జరుపుతున్నారు.