జగన్ నే డైరెక్టుగా ఢీకొంటున్న ధూళిపాళ్ల

దూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీని కాపాడుకునేందుకు అమూల్ ను డీకొనేందుకు నిర్ణయించుకున్నారు. డెయిరీలోని కీలక వ్యక్తులందరితో మాట్లాడుతున్నారు. డెయిరీకి చెందిన రైతులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో నరేంద్ర భరోసా కల్పిస్తున్నారు. లీటర్ కు రూ.నాలుగున్నర చొప్పున అధిక ధర చెల్లిస్తామని నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. రైతుల కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అమూల్ కు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోంది. లీటర్ కు రూ.4 చొప్పున ఎక్కువ ఇస్తామని […]

Written By: Srinivas, Updated On : May 30, 2021 12:25 pm
Follow us on

దూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీని కాపాడుకునేందుకు అమూల్ ను డీకొనేందుకు నిర్ణయించుకున్నారు. డెయిరీలోని కీలక వ్యక్తులందరితో మాట్లాడుతున్నారు. డెయిరీకి చెందిన రైతులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో నరేంద్ర భరోసా కల్పిస్తున్నారు. లీటర్ కు రూ.నాలుగున్నర చొప్పున అధిక ధర చెల్లిస్తామని నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. రైతుల కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అమూల్ కు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోంది. లీటర్ కు రూ.4 చొప్పున ఎక్కువ ఇస్తామని చెప్పడంతో ప్రభుత్వం చొరవ ఏంటో తెలుస్తోంది. ప్రభుత్వం రూ.4 బోనస్ ప్రకటించడంపై చాలా మందికి అనుమానాలున్నాయి. అమూల్ కు ఏపి సర్కారు చూపిస్తున్న తీరు చూస్తుంటే పరిస్థితి అర్థమైపోతోంది. సంగం డెయిరీ రైతులను గందరగోళ పరిచి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. దీంతో ప్రభుత్వంపై పోరాడటానికి రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనాలు దక్కేలా చూడాల్సిన అవసరం ఏర్పడింది.

సంగం డెయిరీలో అవకతవకలున్నాయంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ధూళిపాళ్ల నరేంద్రపై కేసులు పెట్టి జైలు పాలు చేసింది. డెయిరీని సోదా చేశారు. మార్కెటింగ్ డేటా సైతం తీసుకుపోయారు. అయినప్పటికి అక్రమాలు జరిగాయని నిరూపించలేకపోయారు. ధూళిపాళ్ల వ్యక్తిగతంగా లబ్ధిపొందారని ఆధారాలు చూపలేకపోయారు. దీంతో సంగం డెయిరీని కాపాడుకునేందుకు ధూళిపాళ్ల మరింత వ్యూహాత్మకంగా కదులుతున్నారు.

వ్యక్తిగత ప్రతిష్టల కోసం ప్రభుత్వం సంగం డెయిరీపై అనవసరంగా కేసులు నమోదు చేయించి అబాసుపాలు చేయాలని ప్రయత్నించింది. నిజానికి తానే అవమానం పొందింది. దీంతో రైతులు సంగం డెయిరీ వెంట ఉంటామన చెబుతున్నారు. అమూల్ సంస్థకు సహకరించేది లేదని పెదవి విరుస్తున్నారు. సంగం డెయిరీని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు.