Pawan Kalyan Visit Chittoor District: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan) అంతరంగం ఎవరికి అంతుపట్టదు. కానీ ఆయన ప్రతి చర్యలు వెనుక ప్రజల అభీష్టం ఉంటుంది. సాధారణ ప్రజలతో మమేకం అయ్యే శాఖలను ఆయన తీసుకున్నారు. ఎందుకంటే కూటమి అధికారంలోకి రావడంతో ఆయనకు హోంమంత్రి లాంటి పదవులు దక్కుతాయని అంతా భావించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ, పర్యావరణ శాఖ వంటి వాటి కోసమే పరితపించారు. వాటితోనే సామాన్య జనాలకు న్యాయం చేయగలనని ఆయన భావించారు. జనసైనికులు ఆయనను ఉన్నత స్థానంలో కనిపించాలని భావించిన.. ఆయన మాత్రం సాధారణ శాఖలను.. ప్రజలతో మమేకమయ్యే శాఖలను కోరుకున్నారు. అయితే ఇప్పుడు అదే శాఖలలో తనదైన మార్కు చూపిస్తున్నారు.
* ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటన..
రెండు రోజుల పర్యటన నిమిత్తం పవన్ కళ్యాణ్ ఉమ్మడి చిత్తూరు( Chittoor ) జిల్లాకు వెళ్లారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి మా మండూరు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అటవీ మార్గంలో రెండు కిలోమీటర్ల మేర పర్యటించారు. నాలుగు కిలోమీటర్ల దట్టమైన అటవీ ప్రాంతంలో పవన్ గడిపారు. క్రూర మృగాలు తిరిగే చోటున పవన్ నడవడమే కాకుండా ప్రతి అంశాన్ని పరిశీలించారు. అటవీ అధికారులను టెన్షన్ పెట్టారు. సాధారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అటవీ ప్రాంతం అంటే దట్టమైన దండకారణ్యం ఉంటుంది. అటువంటి చోట పవన్ కళ్యాణ్ పర్యటించడం హాట్ టాపిక్ గా మారింది.
* అడవిలో ఆసక్తిగా గడుపుతూ..
ఉమ్మడి చిత్తూరు జిల్లా మామండూరు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం, అంకుడు, తెల్ల మద్ది, వెదురు వంటి అటవీ సంపద విశేషంగా కనిపిస్తుంది. శేషాచలంలో కనపడే అరుదైన మొక్కలు, చెట్లు కనిపిస్తాయి. అటువంటి వాటిని నిశితంగా పరిశీలించారు. అటవీ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది వివరాలను అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని ఆసక్తిగా ఆ పరిసర ప్రాంతాలను తిలకించారు. వాగుకి ఇరువైపులా ఉన్న అరుదైన చెట్ల వివరాలను తెలుసుకున్నారు. ఇలా పవన్ పర్యటన ఆసక్తికరంగా సాగింది. నల్లని టీ షర్టు తో పాటు ఆర్మీ యూనిఫామ్ గా వాడే ఖాకీ ఫ్యాంటును ధరించారు పవన్ కళ్యాణ్. అచ్చం జల్సా సినిమాలో అడవిలో అన్నగా కనిపించారు పవన్ కళ్యాణ్. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తిరుపతి జిల్లాలో మాముండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించి, ఎర్రచందనం గోదాములు పరిశీలించి, ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారు.#OperationRedSanders pic.twitter.com/T8DuoHmK89
— JanaSena Shatagni (@JSPShatagniTeam) November 9, 2025