https://oktelugu.com/

TTD Board: టీటీడీ బోర్డుపై కోర్టుకు

వాస్తవానికి ప్రభుత్వానికి,పార్టీకి సేవలందించిన వారికి ఈ పదవుల్లో నియమిస్తుంటారు. కానీ జగన్ దీనికి తిలోదకాలు ఇచ్చారు. తనకు అంతర్గతంగా సాయం చేసే వారికి, ఇతర రాష్ట్రాల ప్రముఖులకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించారు.

Written By:
  • Dharma
  • , Updated On : August 29, 2023 5:33 pm
    TTD Board

    TTD Board

    Follow us on

    TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల నియామకం వివాదాస్పదమైంది. తనకు పనికొచ్చారని కొందరిని.. భవిష్యత్తులో పనికొస్తారని మరికొందరిని టీటీడీ బోర్డులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కనీస నిబంధనలు పాటించలేదు. ఆర్థిక నేరగాళ్లను, కేసులు ఉన్నవారికి పదవులు ఇవ్వడం పై దుమారం రేగుతోంది. దీనిపై న్యాయ పోరాటానికి విపక్షం తో పాటు కొందరు ప్రయత్నిస్తుండడం టీటీడీ ప్రతిష్ట మసకబారనుంది.

    వాస్తవానికి ప్రభుత్వానికి,పార్టీకి సేవలందించిన వారికి ఈ పదవుల్లో నియమిస్తుంటారు. కానీ జగన్ దీనికి తిలోదకాలు ఇచ్చారు. తనకు అంతర్గతంగా సాయం చేసే వారికి, ఇతర రాష్ట్రాల ప్రముఖులకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించారు. తనకు తానుగా వివాదాలను పిలిచి వాటేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకమైన నిందితుల్లో శరత్ చంద్రారెడ్డి ఒకరు. ఆయన్ను టిటిడి బోర్డు సభ్యత్వం కల్పించడం వివాదాస్పదమవుతోంది. ధర్మకర్తల మండలి లో 24 మంది సభ్యులను నియమించారు. కానీ ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి నియామకంలో మాత్రమే వివాదం నడుస్తోంది. ఆయనకు పదవి ఇవ్వడం ద్వారా శరత్ చంద్రారెడ్డి ఆర్థిక నేరాలను జగన్ సమర్థించినట్లు అయ్యింది.

    దీనిపై ముప్పేట దాడిని జగన్ ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ శ్రేణులు సైతం ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. జగన్ కి ఇది అవసరమా అని ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ పై బయటకు వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకువచ్చి టీటీడీ బోర్డు పదవి ఇవ్వడం తప్పుడు చర్యగా ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ప్రకటించింది. దీనిపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలు సైతం దాఖలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. జగన్ చేజేతులా వివాదాలను కొని తెచ్చుకుంటుండడం విమర్శలకు తావిస్తోంది.