Movie Publicity: చాలామంది సినీ పెద్దలు సినిమాలకు పబ్లిసిటీ చాలా అవసరం అని అనుకుంటూ ఉంటారు. సినీ ప్రియులు సైతం సినిమాకి పబ్లిక్ సిటీ చేయకపోతే సినిమాలు ఎలా ప్రేక్షకులకు రీచ్ అవుతాయి అని అభిప్రాయపడుతూ ఉంటారు.
కానీ నిజంగా సినిమాలకు పబ్లిసిటీ అవసరమా అని భావిస్తున్నారట ప్రస్తుతం ఇండస్ట్రీ జనాలు మాత్రం. ఎందుకంటే చాలా సినిమాలు అస్సలు పబ్లిసిటీ లేకుండా బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి. చిన్న హీరోలా ..పెద్ద హీరోలా.. అని కాదు సినిమా కథ బాగుంటే బడ్జెట్ పెద్దగా లేకపోయినా పబ్లిసిటీ పెద్దగా లేకపోయినా సినిమా బ్లాక్ బస్టర్ సాధిస్తుందని పలుమార్లు పలు సినిమాలు రుజువు చేశాయి.
అప్పట్లో శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమా అస్సలు మినిమం పబ్లిసిటీ మినిమం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయింది. మొదటిరోజు ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసి ఉండకపోయుండొచ్చు కానీ రెండో రోజు నుంచి మాత్రం నిజంగానే సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక మొన్న రిలీజ్ అయిన రజినీకాంత్ జైలర్ సినిమాకి కూడా ప్రమోషన్స్ చేయలేదు. కానీ ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వీటిని బట్టి అర్థమయిందేమిటి అంటే ప్రమోషన్స్ చేస్తే మొదటిరోజు మొదటి షోకి ప్రేక్షకులు వస్తారేమో.. అదే సినిమా బాగుంటే ప్రమోషన్స్ చేయకపోయినా.. సెకండ్ షో నుంచి ఆ సినిమాకి ప్రేక్షకులు రావడం ఖాయం.
ముఖ్యంగా ప్రస్తుతం జనరేషన్ వారు ప్రమోషన్స్ కన్నా కూడా చూసిన ప్రేక్షకుడి అభిప్రాయాన్నే ఎక్కువ గౌరవిస్తున్నారు. కాబట్టి ప్రమోషన్స్ పైన పెద్దగా ఖర్చు పెట్టకపోవడమే నిర్మాతలకు మంచి పని అని అభిప్రాయపడుతున్నారు చాలామంది. పబ్లిసిటీ చేసినా, చేయకపోయినా సినిమాను బట్టే రిజల్ట్
అందువల్ల ఇక పబ్లిసిటీ ఎందుకు అంటున్నారట కొందరు.