Ajit Pawar plane crash updates: బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. విమానం ల్యాండ్ అవుతున్న క్రమంలో ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానం అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ సహా ఐదుగురు కన్నుమూశారు.
అజిత్ పవార్ ప్రయాణించిన ప్రైవేట్ విమానం పేరు learjet 45, registration VT SSK.. గతంలోను ఈ విమానం ప్రమాదానికి గురైంది. 2023 సెప్టెంబర్ నెలలో ముంబై విమానాశ్రయం లో ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పి పడిపోయింది. ఆ సమయంలో భారీ వర్షం కురిసింది. ఈ ప్రమాదంలో విమానం తీవ్రంగా దెబ్బతిన్నది. ఆ సమయంలో విమానంలో 8 మంది ఉన్నారు. వారంతా కూడా తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదం తర్వాత విమానానికి మరమ్మతులు చేశారు. అనంతరం మళ్లీ సర్వీస్ లోకి తీసుకొచ్చారు. అదే విమానం బుధవారం ప్రమాదానికి గురైంది. ముంబై నుంచి అజిత్ పవార్ విమానంలో బారామతి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం 8 గంటల 40 నిమిషాల సమయంలో బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఆ విమానం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. మంటలు విపరీతంగా వ్యాపించడంతో అజిత్ పవార్ కన్నుమూశారు.
విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా విమానం మీద పైలట్ నియంత్రణ కోల్పోయాడు. విమానం కుప్పకూలిపోయినప్పుడు అందులో అజిత్ పవార్, ఆయన భద్రతను పర్యవేక్షించే అధికారి, ఒక అటెండెంట్, ఇద్దరు పైలెట్లు గమనించినట్టు తెలుస్తోంది. ఇక ఈ విమానాన్ని ఢిల్లీకి చెందిన వీఎస్ఆర్ వెంచర్స్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ విమానం గతంలో ప్రమాదానికి గురైంది. దానికి మరమ్మతులు చేసి మళ్లీ వాడటం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతికంగా ఏమైనా లోపం ఉందా.. వాతావరణంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా.. అనే కోణంలో పౌర విమాన యాన శాఖ విచారణకు ఆదేశించింది. ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అజిత్ పవార్ కన్ను మూయడం మహారాష్ట్ర రాజకీయాలలో తీవ్రమైన విషాదాన్ని నింపింది.