Chiranjeevi vs Pawan Kalyan: నేటి తరం స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి తప్ప అందరికీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ళ నుండి పవన్ కళ్యాణ్ నుండి విడుదల అవుతున్న సంక్రాంతి సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి. కేవలం ‘గోపాల గోపాల’ చిత్రం మాత్రమే యావరేజ్ రేంజ్ లో ఆడింది. ముఖ్యంగా సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అజ్ఞాత వాసి’ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటి నుండి సంక్రాంతికి పవన్ కళ్యాణ్ సినిమా అనగానే అభిమానుల్లో భయం మొదలైంది. ఈమధ్య కాలం లో సంక్రాంతికి పవన్ కళ్యాణ్ సినిమా రాలేదు కానీ, త్వరలోనే ఆయన సురేంద్ర రెడ్డి తో చేయబోయే సినిమా మాత్రం 2027 సంక్రాంతి కానుకగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు .
పూర్తి వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ , సురేందర్ రెడ్డి మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నెల నుండి మొదలు కాబోతుంది అట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మైంటైన్ చేస్తున్న లుక్ కూడా ఆ సినిమా కోసమే అని అంటున్నారు. ఏప్రిల్ నెలలో మొదలు పెట్టి, నాలుగు నెలల్లోనే సినిమా షూటింగ్ ని పూర్తి చెయ్యాలనే ఆలోచన లో ఉన్నారు. ఈ చిత్రం లో కూడా పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడట. ఆయన గత చిత్రం ‘ఓజీ’ లో ముంబై గ్యాంగ్ స్టర్ గా కనిపించి ఆడియన్స్ ని ఎలా అలరించాడో అందరికీ తెలిసిందే. ఈ సంక్రాంతికి కూడా అదే జానర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు చూస్తున్నాడు పవర్ స్టార్. అయితే వచ్చే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా విడుదలయ్యే అవకాశాలు.
‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న మెగాస్టార్, త్వరలోనే డైరెక్టర్ బాబీ తో చేయబోతున్న సినిమాని కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నాడు. అదే సంక్రాంతికి అనిల్ రావిపూడి కొత్త సినిమా కూడా విడుదల కాబోతుంది. అయితే పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఒకవేళ సంక్రాంతికి కచ్చితంగా విడుదలయ్యే పరిస్థితి ఉంటే, మెగాస్టార్ చిరంజీవి పోటీకి వస్తాడా?, లేదా తమ్ముడి కోసం త్యాగం చేస్తాడా అనేది ఇప్పుడు చూడాలి. సంక్రాంతికి ఫ్యామిలీ జానర్ సినిమాలు , లేదా ఎంటర్టైన్మెంట్ సినిమాలు వర్కౌట్ అవుతాయి కానీ , యాక్షన్ జానర్ సినిమాలు వర్కౌట్ అవ్వడం ఎప్పుడూ చూడలేదు. మరి ఈ పవన్ యాక్షన్ జానర్ మూవీ సంక్రాంతికి విడుదలై ఎన్ని వండర్స్ ని క్రియేట్ చేయబోతుందో చూడాలి.