Prudhvi Raj
Prudhvi Raj: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయకుడ 10 రోజుల క్రితం అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్టును విపక్ష నేతలు ఖండిస్తున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. ఐటీ ఉద్యోగులు నిరసన కూడా తెలిపారు. కానీ, బాబు అరెస్ట్‌పై సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడు, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంత వరకు స్పందించలేదు. ఈ విషయం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. జూనియర్ ఎన్టీఆర్‌కు భవిష్యత్తులో సైతం ఇంటర్వ్యూలలో ఇందుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది.
సైలెన్స్ బ్రేక్ చేస్తారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైలెన్స్ బ్రేక్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే జూనియర్ ఎన్టీఈఆర్ మౌనంపై నటుడు పృథ్వీరాజ్ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారని, ఆయన ప్రతిభకు అవార్డులు వస్తున్నాయని తెలిపారు. టీడీపీలో పెద్దలు ఉన్నారని అందువల్లే తారక్ స్పందించడం లేదని వెల్లడించారు. సమయం వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తాడని వెల్లడించారు.
పొత్తులపై క్లారిటీ..
పొత్తులపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే వివరణ ఇచ్చారని కూడా పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. టీడీపీ అహం దెబ్బ తినేలా మాట్లాడవద్దని పవన్ కోరారని తెలిపారు. సీఎం నినాదాలు ఇప్పుడు చేయవద్దని సమయం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదామని పవన్ సూచించారని పేర్కొన్నారు.
ఏపీలో అధ్వాన పాలన
ఇక ఏపీ పాలనపై పృథ్వీరాజ్ స్పందించారు. ఏపీలో రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల తాను కూడా ఇబ్బందులు పడ్డానని పేర్కొన్నారు. ఏపీ పథకాల అమలులో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. పృథ్వీరాజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.