Telangana BJP: బీజేపీ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతుందా ?, ముఖ్యంగా కుల రాజకీయం చేస్తోందా ?, హైదరాబాద్ లో ఇప్పుడు బీజేపీ ప్రధానంగా ఇప్పుడు కులాల మీదే ఆధారపడింది. కేసీఆర్ పెట్టిన కులాల కుంపటిని బీజేపీ అందిపుచ్చుకుని మతాల మధ్య చిచ్చు పెడుతోంది. నిజానికి ఐక్యంగా ఉన్న దేశాన్ని మతాల పేరిట విభజన చేసింది బీజేపీ. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకే పాటు పడకుండా కుల నాయకులను రెచ్చ గొడుతూ ఓట్లు పొందాలని ఆశ పడుతున్నారు బీజేపీ నాయకులు.

ఆ మధ్య బీజేపీ పెద్దలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో కూడా కులాల కలకలం రేపింది. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అదే ప్లాన్ ను వర్కౌట్ చేస్తోంది. ఇక్కడ కులాల సమీకరణలు బట్టే ఓట్లు పడతాయి. అందుకే బీజేపీ కూడా అదే దారిలో ప్రయాణం చేస్తోంది. ఇటు కేసీఆర్ కూడా బలహీనపడిపోవడంతో అమిత్ షా చక్రం తిప్పి..బీసీ నేతలందరినీ బీజేపీ పార్టీలోకి తీసుకొస్తున్నారు.
కులాలు లేకపోతే, బీజేపీ, 24-28 శాతం మాత్రమే ఓట్లు పొందే పార్టీగా ఉంటుంది. వాజ్‌పేయి హయాంలో ఆ పార్టీకి ఇంతే శాతం ఓట్లు దక్కాయి. కానీ మోదీ హాయాం. బీజేపీ సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే, భారత రాజకీయాల్లో ఆధిపత్యాన్ని ఇలాగే కొనసాగించాలంటే ఆ పార్టీ దళితులు, ఓబీసీలు, వెనకబడిన ముస్లిం( దళిత ముస్లింలు లేదా పస్మాంద ముస్లింలు) వర్గాలలోకి అడుగుపెట్టాలి. బీజేపీ ఉద్దేశం స్పష్టంగా అర్థం అవుతుంది.
ఆ సంఖ్యను పెంచుకోవడమే వారి ఉద్దేశమని తెలుస్తోంది’. తెలంగాణలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల్లోకి పార్టీని తీసుకెళ్లడంపైనే బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. అనేక మీడియా కథనాల ప్రకారం, బీజేపీ అగ్ర నాయకత్వం ఎక్కువగా వెనకబడిన ముస్లింలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌లో చాలా ఏళ్లుగా కులగణన జరగలేదు.
కానీ, అంచనాల ప్రకారం జనాభాలో ఓబీసీలు 45-48 శాతం, దళితులు-గిరిజనులు సుమారుగా 22.5 శాతం, పస్మాంద ముస్లింలు దాదాపుగా 8.5 శాతం ఉంటారు. అగ్రవర్ణాల జనాభా సుమారు 15-18 శాతం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో బీజేపీ ఇలా విస్తరించడానికి ఆయన అనుసరించిన దళిత్-ఓబీసీ అనే రాజకీయ వ్యూహం దాగి ఉంది. ఏది ఏమైనా ‘ఒక్కసారి దళితుల, ఓబీసీలతో కూడిన పార్టీగా అవతరిస్తే, వచ్చే పదేళ్ల వరకు ఎలాంటి ఢోకా ఉండదని బీజేపీకి తెలుసు. అదే ప్లాన్.