జగన్ హయాంలో ఉన్నతాధికారుల గతి ఇంతేనా?

ఆంధ్రప్రదేశ్ లో అధికారులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విధానాలు ప్రజలకు చేరే క్రమంలో వారి పాత్ర కీలకమే. కానీ కొందరు అధికారులు వారికి సహకరిస్తూ తమ భక్తిని చాటుతున్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన వారే సర్వం ప్రభుత్వానికి ఊడిగం చేసేందుకు ముందుకు వెళుతున్నారు. ఏపీలో సీఎం జగన్ కు ఓ ఉన్నతాధికారి నమ్మిన బంటుగా వ్యవహరించేవారు. అన్ని పనుల్లో తనదైన శైలిలో చేసుకుంటూ జగన్ దగ్గర తన ఉనికి చాటుకునే వారు. […]

Written By: Srinivas, Updated On : July 26, 2021 12:51 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో అధికారులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విధానాలు ప్రజలకు చేరే క్రమంలో వారి పాత్ర కీలకమే. కానీ కొందరు అధికారులు వారికి సహకరిస్తూ తమ భక్తిని చాటుతున్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన వారే సర్వం ప్రభుత్వానికి ఊడిగం చేసేందుకు ముందుకు వెళుతున్నారు. ఏపీలో సీఎం జగన్ కు ఓ ఉన్నతాధికారి నమ్మిన బంటుగా వ్యవహరించేవారు.

అన్ని పనుల్లో తనదైన శైలిలో చేసుకుంటూ జగన్ దగ్గర తన ఉనికి చాటుకునే వారు. కానీ రానురాను ఏమైందో తెలియదు కానీ జగన్ కు ఆ అధికారికి పడట్టేదు. పక్కన కూర్చున్నా పట్టించుకోవడం లేదు. ఏదైనా కావాలన్నా సలహారునో లేక ఇతరులనో అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో ఆ అధికారి సెలవులో వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఏపీలో సీఎస్ గా ఎల్. వి. సుబ్రహ్మణ్యంతో పాటు ఆ అధికారికి కూడా ఉన్నత పదవి లభించింది. కీలకమైన శాఖకు అధిపతి అయ్యారు. దీంతో ఆయన ప్రభుత్వం చెప్పినట్లుగా చేసుకుపోయారు. దీంతో ఆయనకు చెప్పకుండానే పనులు జరిగిపోయాయి. ఆయన ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేశారు. దీంతో ఆయనలో అసంతృప్తి రగలడంతో బదిలీ చేసుకుని వెళ్లిపోవాలని భావించారు. ఆయన ఉన్నా వెళ్లినా ఏం కాదనే అభిప్రాయం రావడంతో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

సదరు అధికారి విశ్వసనీయత ఎక్కువ కావడంతో కొంతమంది అధికారులు ఆయన శాఖపై పట్టు సాధించేందుకు ప్రయత్నం చేశారు. చివరికి ఆయననే డమ్మీ చేశారు. కానీ అప్పటికే చేయి దాటి పోవడంతో గతంలో సిన్సియర్ ఆఫీసర్ గా గుర్తింపు తెచ్చుకున్నా ప్రస్తుతం దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జగన్ దగ్గర పోయిన పరువును మళ్లీ దక్కించుకునే క్రమంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఉద్యోగ నిర్వహణ కష్టమే అనే సంకేతాలు స్పష్టం అవుతున్నాయి.