అధికారుల మెడకే ఆ ‘చెత్త’ వ్యవహారం

కృష్ణా జిల్లాలో బ్యాంకుల ముందు చెత్త వ్యవహారం రోజురోజుకూ రాజుకుంటోంది. ఇప్పటికే ఉయ్యూరు మున్సిపల్‌ కమిషనర్‌‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు చేయగా.. వివరణ ఇవ్వాలని విజయవాడ, మచిలీపట్నం కమిషనర్లను ఆదేశించింది. ఈ చర్యలు తీసుకునే ముందు ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ప్రకాశరావుతో క్షమాపణలు చెప్పిస్తూ.. బ్యాంకర్లను వేడుకుంటూ ఓ వివరణ ఇప్పించారు. Also Read: తిరుపతిలో గెలిచేందుకు పార్టీల ఆరాటం కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా బ్యాంకర్లను బతిమాలుతున్నట్లుగా ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామన్నట్లుగా లేఖ […]

Written By: Srinivas, Updated On : December 28, 2020 5:18 pm
Follow us on


కృష్ణా జిల్లాలో బ్యాంకుల ముందు చెత్త వ్యవహారం రోజురోజుకూ రాజుకుంటోంది. ఇప్పటికే ఉయ్యూరు మున్సిపల్‌ కమిషనర్‌‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు చేయగా.. వివరణ ఇవ్వాలని విజయవాడ, మచిలీపట్నం కమిషనర్లను ఆదేశించింది. ఈ చర్యలు తీసుకునే ముందు ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ప్రకాశరావుతో క్షమాపణలు చెప్పిస్తూ.. బ్యాంకర్లను వేడుకుంటూ ఓ వివరణ ఇప్పించారు.

Also Read: తిరుపతిలో గెలిచేందుకు పార్టీల ఆరాటం

కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా బ్యాంకర్లను బతిమాలుతున్నట్లుగా ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామన్నట్లుగా లేఖ రాశారు. మరోవైపు కేంద్రం ఈ వ్యవహారంపై సీరియస్‌ అవడంతో తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం.. క్షమాపణలు చెప్పడం వంటివి జరుగుతున్నాయి. కానీ.. ఈ మొత్తం ఘటనకు అసలు సూత్రధారులెవరనేదానిపై మాత్రం లోతుగా వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధపడటం లేదు. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే ఓ సలహాదారు, ఆయనకు తోడు మరో ఉన్నతాధికారి కలిసి బ్యాంకులను ఎలా ‘మేనేజ్’ చేయాలో ప్లాన్ చేసి మరీ.. జిల్లాల వారీగా ఓ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని ఆరోపణలు. ముందుగా.. కృష్ణా జిల్లా బ్యాంకులపై ఆ ప్రయోగం చేశారని అధికార వర్గాల్లో చాలా ఉధృతంగా ప్రచారం జరుగుతోంది. తీరా బయటపడేసరికి.. వారి ఆదేశాలను పాటించిన వారిని బలి పశువుల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: వైసీపీలో పెరుగుతున్న కుమ్ములాటలు

మరోవైపు.. ఈ ఘటన వివాదాస్పదం అయిన తర్వాత ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ప్రకాశరావు మీడియాతో మాట్లాడినప్పుడు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అలా చేశామని ప్రకటించారు. తీరా పూర్తి వివాదం అయ్యాక ఉన్నతాధికారులకు.. ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇలా వివరణ ఇచ్చిన కాసేపటికే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ సలహాదారు.. మరో మున్సిపల్ ఉన్నతాధికారి.. ఉద్యోగులతో నీతిమాలిన పనులు చేయించి ఏదో గొప్పగా బ్యాంకర్లను భయపెట్టామని అనుకున్నారు. అయితే ఇలాంటి పనులకు నేరుగా ఆదేశాలివ్వలేరు కాబట్టి.. మౌఖికంగానే చెబుతుంటారు. అందుకే.. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్లు ఇరుక్కుపోయారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఈ వ్యవహారం వారి కెరీర్‌లో మచ్చగా మారడమే కాదు.. భవిష్యత్‌లో కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉందట. తాము చెప్పిన పని చేసి సస్పెన్షన్‌కు గురయినందున.. కొద్ది రోజుల్లో ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్‌కు ప్రభుత్వ పెద్దలు మంచి పోస్టింగ్ ఇవ్వొచ్చు కానీ.. ఆయన ట్రాక్ రికార్డులో అదో మైనస్‌గా ఉండిపోవడం ఖాయం. ప్రభుత్వం మారిన తర్వాత క్రమశిక్షణాచర్యలకూ దిగొచ్చు. మొదట చెత్త వేసింది కార్మికులేనని వారిపై నెట్టేయాలని ప్రయత్నించారు. కానీ.. కృష్ణా జిల్లా మొత్తం ఒకేసారి జరగడంతోనే కార్మికులు కాదని స్పష్టమయింది. కానీ..కేంద్రం చాలా సీరియస్‌గా స్పందించడంతో అధికారులను బలి చేయక తప్పలేదు. మొత్తంగా ఈ చెత్త వ్యవహారం కాస్త చివరికి అధికారుల మెడకే చుట్టుకునే పరిస్థితి వచ్చింది.