నిరుపేదల సంతోషంతో ఆనందంగా ఉంది: జగన్
‘నవరత్నాలు-పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ’ కార్యక్రమంలో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరులో ఫైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ సొంతిళ్లు లేని నిరుపేదల్లో చిరునవ్వు కనిపిస్తోందన్నారు. ఊరందూరులో 167 ఎకరాల్లో 6,232 ప్లాట్లు వేశారు. వీటిలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు, 456 శ్రీకాళహస్తీ రూరల్, […]
Written By:
, Updated On : December 28, 2020 / 01:53 PM IST

‘నవరత్నాలు-పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ’ కార్యక్రమంలో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరులో ఫైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ సొంతిళ్లు లేని నిరుపేదల్లో చిరునవ్వు కనిపిస్తోందన్నారు. ఊరందూరులో 167 ఎకరాల్లో 6,232 ప్లాట్లు వేశారు. వీటిలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు, 456 శ్రీకాళహస్తీ రూరల్, 1,468 ప్లాట్లు ఏర్పేడు రూరల్ ప్రాంతాల వారికి కేటాయించారు.