https://oktelugu.com/

`కేజీఎఫ్ 2’లో బాలయ్య బాబు.. నిజం కాదు !

కన్నడ హీరోను నేషనల్ రేంజ్ లో రాకింగ్ స్టార్ గా నిలబెట్టిన సినిమా కేజీఎఫ్. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాల గురించి, ఈ సినిమా నేషనల్ రేంజ్ లో సాధించిన కలెక్షన్స్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు నటించబోతున్నాడు అంటూ గూగుల్ చూపిస్తుండటంతో అందర్నీ షాక్ కి గురిచేసింది. ఆశ్చర్యం కలిగించేలా గూగుల్‌ సెర్చ్‌లో ‘కేజీఎఫ్‌2’ అని వెతికితే ఆ సినిమాలో నటీనటుల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 28, 2020 / 02:04 PM IST
    Follow us on


    కన్నడ హీరోను నేషనల్ రేంజ్ లో రాకింగ్ స్టార్ గా నిలబెట్టిన సినిమా కేజీఎఫ్. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాల గురించి, ఈ సినిమా నేషనల్ రేంజ్ లో సాధించిన కలెక్షన్స్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు నటించబోతున్నాడు అంటూ గూగుల్ చూపిస్తుండటంతో అందర్నీ షాక్ కి గురిచేసింది. ఆశ్చర్యం కలిగించేలా గూగుల్‌ సెర్చ్‌లో ‘కేజీఎఫ్‌2’ అని వెతికితే ఆ సినిమాలో నటీనటుల జాబితాలో బాలయ్య బాబు కూడా ఉన్నాడు. పైగా బాలయ్య పోషించబోయే పాత్ర పేరు ‘ఇనాయత్‌ ఖలీల్‌’ అని కూడా రాసి ఉంది.

    Also Read: “షకీలా” సినిమా ఎలా ఉందంటే ?

    మరి ఇది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది చూడాలి. ఇక యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఈ సినిమా సీక్వెల్ ముందు వరుసలో ఉంటుంది. అన్నట్టు ఈ సినిమా టీజర్ జనవరి 8న యశ్ పుట్టిన రోజు కానుకగా.. టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 8న యశ్ పుట్టిన రోజుకే ఆ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అలాగే వచ్చే ఏడాది పుట్టినరోజుకు టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ సినిమా కోసం అన్ని భాషల ఇండస్ట్రీ ప్రేమికులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

    Also Read: ‘ఆచార్య’లో మెగాస్టార్ తో మెహబూబ్!

    అయితే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ గ‌నుల‌పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ దానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేస్తూ.. ఎండింగ్ లో మంచి ఇంట్రస్ట్ పెట్టి ఎండ్ చేశారు. దాంతో సహజంగానే పార్ట్ 2 పై అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. అందుకే పార్ట్ 2 లో ఇంకా భీక‌ర మాఫియాని ప‌తాక స్థాయిలో చూపించ‌బోతున్నారట. ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిలింస్ సంస్థ మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్