Shocking Photos: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కారులో పేలుడు పదార్థాలు ఉన్నాయని.. డాక్టర్ నబి అనే వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడడానికి ఆ కారులో పేలుడు పదార్థాలు తీసుకొచ్చాడని.. అంతకంటే ముందుగానే నబి సహచరులైన ఉగ్రవాదులు పోలీసులకు చిక్కారు. దీంతో అతడు భయాందోళనకు గురై ఒక్కసారిగా కారులో ఉన్న అతడు పేల్చివేసుకున్నాడు. దీని కంటే ముందుగానే అతడు మూడు గంటలపాటు కారు లోనే ఉన్నాడు. పోలీసులకు చిక్కితే తన ప్రాణాలు పోవడం మాత్రమే కాకుండా.. తనను మరింత హింసిస్తారని భయంతో అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.
వాస్తవానికి నబి గురించి పోలీసులకు సమాచారం అంత సులువుగా దొరకలేదు. దీనికంటే ముందు సరిగ్గా నెల క్రితం జమ్మూ కాశ్మీర్లో ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డాక్టర్ ఆదిల్ మహమ్మద్ రాధర్ అనే వ్యక్తి జై షే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన పోస్టర్ అంటిస్తూ కనిపించాడు. ఇది పోలీసులకు తెలియడంతో వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతడిని విచారిస్తే అన్ని విషయాలు బయటకు తెలిసాయి. అతడు చెప్పిన సమాచారం ఆధారంగానే పోలీసులు ఫరిదాబాద్ దాకా వచ్చారు. ఇక్కడి హాస్పిటల్లో పనిచేస్తున్న అనేకమంది డాక్టర్లు ఉగ్రవాదులుగా మారిపోయారని.. అన్నిటికంటే ముఖ్యంగా 2,900 కిలోల పేలుడు పదార్థాలను నిల్వ చేశారని తేలింది. ఈ ప్రకారం దేశంలో అతిపెద్ద భారీ ఉగ్రకుట్రకు వారు రూపకల్పన చేశారని పోలీసుల దర్యాప్తులో బయటపడింది.. వాస్తవానికి రాధర్ దొరికిన తర్వాత.. పోలీసులకు మరింత సమాచారం లభించింది. అంతేకాదు తమ మాడ్యూల్ కు రాధర్ టచ్ లోకి రాకపోవడంతో నబికి అనుమానం వచ్చింది. రాధర్ మాత్రమే కాకుండా ఇంకా చాలామంది ఫోన్లు స్విచ్ ఆఫ్ అయి ఉండడం.. వారు టచ్ లోకి రాకపోవడంతో నబీకి అనుమానం బలపడింది.
దీంతో అతడు ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిపోయాడు. పైగా ఓ కారులో పేలుడు పదార్థాలను తీసుకొని వెళ్ళిపోయాడు. ఢిల్లీ నగరంలోని మెట్రో దగ్గర దాదాపు మూడు గంటల పాటు తన కారులోనే ఉన్నాడు.. ఆ తర్వాత తనను తాను అంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి భారీ కుట్రకు ఉగ్రవాదులు రూపకల్పన చేశారు. చివరికి ఇంటలిజెన్స్ రంగంలోకి దిగడంతో వారి మాడ్యూల్ మొత్తం బయటపడింది. కుట్ర కోణం నిర్వీర్యం అయిపోయింది. ఒకవేళ గనుక వారు అంత మొత్తంలో పేలుడు పదార్థాలతో దేశమంతా దాడులు చేసేవారు. వాస్తవానికి దొరికిన ఉగ్రవాదులు మొత్తం జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందినవారు. ఆర్టికల్ 370 తర్వాత అక్కడ పరిస్థితి మొత్తం బాగానే ఉందని అనుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అలా లేదని ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. ఇంటెలిజెన్స్ అత్యంత చురుకుగా వ్యవహరించడం వల్లే భారీ ప్రమాదం దేశానికి తప్పింది. అయితే ఈ ఉగ్రవాదులు మనదేశంలో ఇంకా ఎంతమంది ఉన్నారు? వైట్ కాలర్ ఘోరాలకు ఎలా పాల్పడబోతున్నారు? అనే విషయాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.