ఆ అవార్డు కాలి గోటితో సమానం..:బాలకృష్ణ

సినీ నట సింహం బాలకృష్ణ ఎక్కువగా మీడియా ముందుకు రారు. ఒకవేళ వస్తే సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూ.. మరోవైపు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలకృష్ణ నిత్యం బిజీగానే ఉంటాడు. అయితే ఇటీవల ఆయన మీడియాతో చాలా ఫ్రీగా మాట్లాడారు. ఆయన నటించిన ఆదిత్య 369 సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా గురించి, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దీంతో బాలకృష్ణ కామెంట్స్ సోషల్ […]

Written By: NARESH, Updated On : July 21, 2021 11:20 am
Follow us on

సినీ నట సింహం బాలకృష్ణ ఎక్కువగా మీడియా ముందుకు రారు. ఒకవేళ వస్తే సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూ.. మరోవైపు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలకృష్ణ నిత్యం బిజీగానే ఉంటాడు. అయితే ఇటీవల ఆయన మీడియాతో చాలా ఫ్రీగా మాట్లాడారు. ఆయన నటించిన ఆదిత్య 369 సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా గురించి, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దీంతో బాలకృష్ణ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ బాలకృష్ణ ఏమన్నాడో చూద్దాం..

‘ఆదితత్య 369 సినిమా.. ప్రపంచంలో ఇలాంటి సినిమాలు చాలా కొన్ని మాత్రమే వచ్చాయి. సోషియో ఫాంటసీ, చరిత్ర, సైన్స్ తో కూడిన ఇలాంటి సినిమా మళ్లీ తీసేందుకు ఇప్పటి వరకు ఎవరూ సాహసం చేయలేదు. ఈ సినిమాకు ముగ్గురు సినిమాటోగ్రఫర్లు పనిచేశారు. వీఎస్ఆర్ స్వామి, కబీర్ లాల్ , పీసీ శ్రీరాంలు తమ పనితనాన్ని అద్భుతంగా చేశారు. సాంకేతికంగా వారు చేసిన సేవలు మరిచిపోలేనివి’అని బాలయ్య అన్నారు.

‘ఇక కొత్త కథలు తీయడంలో మేమే ట్రెండ్ సెట్టర్. ఫ్యాక్షన్లలోనూ, పౌరాణికం గానీ, హీస్టారికల్ మూవీస్లో విభిన్నమైన సాహసాలు చేశాం. ఆదిత్య 369 ఓ విభిన్నమైన సినిమా. ఇలాంటి సినిమా ఇప్పటి వరకు ఎవరూ తీయడానికి సాహసం చేయలేదు. భవిష్యత్తులో చేస్తారో తెలియదు. సినిమాకు ఇళయరాజ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఒక ప్రేక్షకుడిగా ఇళయరాజ అంటే ఎంతో ఇష్టం. కానీ నా సినిమాకు ఆయన సంగీతం ఇవ్వడం వరంగానే భావిస్తా..’ అని అన్నారు.

‘ఎన్టీఆర్ లాంటి మహానాయకుడు ఎన్ని అవార్డులు తీసుకున్నారు..? అవార్డులు వస్తేనే నటులు అంటే ఎలా..? ప్రేక్షకుల్లో మంచి నటుడు అనిపించుకోవాలి. అదే సమయంలో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వపకపోవడం వల్ల ఆయన స్టేటజీ ఏమాత్రం తగ్గదు. ఆ అవార్డు ఎన్టీఆర్ కాలి గోటితో సమానం. అ అవార్డు ఎన్టీఆర్ కు ఇవ్వడం వల్ల ఇచ్చినవారికే గౌరవం దక్కుతుంది’ అని బాలకృష్ణ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.