https://oktelugu.com/

ఏపీ మంత్రుల అవినీతిపై బీజేపీ వ్యూహాత్మక దాడి

గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పునుక్కున్నట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులపై బీజేపీ వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేస్తోంది. ఆరోపణలతో ఇరుకున పెడుతోంది. ఓ మంత్రి, అధికారికి మూడు కోట్లతో బంగ్లా కట్టిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపణలు చేస్తే తక్షణమే కొడాలి నాని మీడియా ముందుకు వచ్చారు. తననే వీర్రాజు ఉద్దేశించి మాట్లాడారని ప్రెస్ మీట్ పెట్టి నోరు విప్పారు. తనకెవరు బంగ్లా కట్టివ్వలేదని చెప్పారు. కావాలంటే సీబీఐ విచారణ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. దీంతో గుమ్మడికాయ దొంగ అంటే […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 21, 2021 / 11:40 AM IST
    Follow us on

    గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పునుక్కున్నట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులపై బీజేపీ వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేస్తోంది. ఆరోపణలతో ఇరుకున పెడుతోంది. ఓ మంత్రి, అధికారికి మూడు కోట్లతో బంగ్లా కట్టిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపణలు చేస్తే తక్షణమే కొడాలి నాని మీడియా ముందుకు వచ్చారు. తననే వీర్రాజు ఉద్దేశించి మాట్లాడారని ప్రెస్ మీట్ పెట్టి నోరు విప్పారు. తనకెవరు బంగ్లా కట్టివ్వలేదని చెప్పారు.

    కావాలంటే సీబీఐ విచారణ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. దీంతో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకోవడం అంటే ఇదేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. సోము వీర్రాజుతో బీజేపీ నేతలు ఎదురుదాడి చేశారు. దీంతో కొడాలి నాని నాలిక కరుచుకున్నారు. మంత్రి కొడాలి నాని తనంతట తాను మీడియా ముందుకు రావడంతో వైసీపీ నేతలకు ఇబ్బందిగా మారింది.

    ఈనేపథ్యంలో ఎలా సమర్థించుకోవాలో తెలియని పరిస్థితిలో పడిపోయింది. దీన్ని బీజేపీ నేతలు అడ్వాంటేజీగా తీసుకుంది. మంత్రులు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని తమ వద్ద ఆధారాలుఉన్నాయని చెబుతున్నారు. అలాంటి వారి చిట్టాలు తమ వద్ద ఉన్నాయని చెప్పడంతో వైసీపీలో ఆందోళన నెలకొంది. అధికారి దగ్గర బంగ్లాను లంచంగా తీసుకున్న మంత్రితోపాటు గతంలో బెంజ్ కారు బహుమతిగా తీసుకున్న ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల తీరుపై రెస్పాన్స్ రావడంతో బీజేపీ నేతలు ఇతర మంత్రులపై ఉన్న ఆరోపణలు, వారి సీక్రెట్ వ్యాపారాల గురించి సమాచారం సేకరిస్తున్నారు. వారి బలహీనతలను గుర్తించి వాటిపైనా వివరాలు లాగుతున్నారు. సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టేందుకు ఆధారాలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో వారిపై ఒత్తిళ్లు రావడంతో ఎలా తప్పించుకోవాలనే దానిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. బీజేపీ నేతల సీరియస్ తో అందరి జాతకాలు మారే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.