https://oktelugu.com/

ట్రెండింగ్: నీకు దండాలు మోడీజీ!

దేశంలో పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోతున్న పెట్రో ధరలు సామాన్యుడికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రతిపక్షాలు గొంతెత్తుతున్నా, ప్రజలను నెత్తి నోరు బాదుకుంటున్నా కూడా మోడీ సర్కార్ ఈ విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదు. కరోనాతో కూలిపోయిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించాలంటే తప్పదు అంటూ ‘పెట్రోల్ డీజిల్’ ను రూ.100 దాటించింది. ఇంకా ఆ పరుగు ఆపడం లేదు. సామాన్యుడి జేబుకు చిల్లులు ఆగడం లేదు. ప్రతి పెట్రోల్ బంక్ లో ప్రధాని మోడీ ఫొటో ఖచ్చితంగా కనిపిస్తుంది. పెట్రోల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 19, 2021 3:43 pm
    Follow us on

    దేశంలో పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోతున్న పెట్రో ధరలు సామాన్యుడికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రతిపక్షాలు గొంతెత్తుతున్నా, ప్రజలను నెత్తి నోరు బాదుకుంటున్నా కూడా మోడీ సర్కార్ ఈ విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదు. కరోనాతో కూలిపోయిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించాలంటే తప్పదు అంటూ ‘పెట్రోల్ డీజిల్’ ను రూ.100 దాటించింది. ఇంకా ఆ పరుగు ఆపడం లేదు. సామాన్యుడి జేబుకు చిల్లులు ఆగడం లేదు.

    ప్రతి పెట్రోల్ బంక్ లో ప్రధాని మోడీ ఫొటో ఖచ్చితంగా కనిపిస్తుంది. పెట్రోల్ బంక్ కు ఆనుకొని ఆ పెట్రో సంస్థల ప్రచారంపై ఉంటుంది. ఈ క్రమంలోనే ఎవరు మొదలుపెట్టారో.. ఎక్కడ మొదలు పెట్టారో తెలియదు కానీ.. ఇప్పుడు దేశంలో ‘థాంక్యూ మోడీజీ చాలెంజ్’ మొదలైంది.

    బంక్ లో పెట్రోల్ డీజిల్ పోసుకున్న వినియోగదారులు బట్టలు విప్పి మోడీ ఫొటోకు నమస్కరిస్తూ.. మాకు ఈ పెట్రోల్ బాధలు ఏంటి మోడీ జీ అని నిరసన తెలుపుతున్న ఫొటోలు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి.

    మోడీ ఫొటో ఎదురుగా నిలుచొని మోడీకి దండం పెడుతున్న ఫొటోలు ఇప్పుడు ట్రెండ్ సృష్టిస్తున్నాయి.ఈ కొత్త చాలెంజ్ కు వాహనదారులు విపరీతంగా స్పందిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఈ చాలెంజ్ నడుస్తోంది.

    ఆకాశానికైనా హద్దు ఉంటుందని.. దేశంలో పెట్రోల్ ధరలకు మాత్రం అడ్డూ అదుపులేకుండా పోయిందని వాహనదారులు వాపోతున్నారు. కానీ భారత్ లో పెట్రోల్ రేట్లు హద్దులేకుండా పెరిగిపోయాయి. అసలు ఎంత వరకు రేట్లు పెంచుతారు.. వారి టార్గెట్ ఏంటనేది జనాలకు అస్సలు అర్థం కావడం లేదంటున్నారు. ఎడా పెడా రేట్లు పెంచేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శిస్తున్నారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో దండాలు పెడుతూ మోడీకి ట్వీట్లతో దేశ ప్రజలు వినూత్న నిరసన తెలుపుతున్నారు.