Homeఆంధ్రప్రదేశ్‌మంత్రి పదవీపై ఆశలు పెంచుకుంటున్న స్పీకర్..!

మంత్రి పదవీపై ఆశలు పెంచుకుంటున్న స్పీకర్..!


ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి ఇటీవలే ఏడాది పూర్తయింది. సీఎంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజానేతగా గుర్తింపు తెచ్చుకుంటూనే ప్రత్యర్థులకు జగన్మోహన్ రెడ్డి షాకిస్తున్నారు. రాజకీయాల్లో 40ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే టీడీపీ హయాంలో జరిగిన స్కాంలను ప్రభుత్వం వెలికితీస్తోంది. చంద్రబాబు హయాంలో మంత్రులు పనిచేసిన నేతలను అవినీతి ఆరోపణల కింద జైళ్లకు పంపిస్తుంది. దీంతో పలువురు టీడీపీ నేతలు ఇప్పటికే వైసీపీ పక్షంలో చేరిపోతున్నారు.

జగన్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్న అధికారుల చేతివాటం

వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి చేసినవారు తమకు మంత్రి పదవీ దక్కుతుందని ఆశించారు. అయితే కొందరు మంత్రి దక్కగా మరికొందరికి నిరాశ ఎదురైంది. దీంతో పలువురు నేతలకు సీఎం జగన్ క్యాబినెట్ హోదా కలిగిన పదవులు అప్పగించి బుజ్జగించారు. మండలి రద్దు నిర్ణయంతో జగన్ క్యాబినెట్లో రెండు బెర్త్ ఖాళీ అయ్యాయి. దీంతో కొత్తవారికి అవకాశం దక్కనుండటంతో ఎవరికీ వారు లాయిబీయింగ్ మొదలుపెట్టారు. ఈనెల 22న ఏపీలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని టాక్ విన్పిస్తుంది. కొత్తవారికి అవకాశం కల్పించడంతోపాటు పలు శాఖల్లో మార్పులు చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారని సమాచారం.

తొలి విడుతలో మంత్రి పదవీ ఆశించి భంగపడిన నేతలంతా మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తహతహలాడుతోన్నారు. ఈక్రమంలో పలువురి నేతల పేర్లు తెరపైకి వస్తున్నారు. క్యాబినెట్ విస్తరణ ముహుర్తం దగ్గరపడుతుండటంతో రోజుకో పేరు రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఏపీ స్పీకర్ వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారం మంత్రి పదవీని ఆశిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మంచి వాగ్ధాటి కలిగి ఉండి ప్రత్యర్థులను బోల్తాకొట్టించడంలో తమ్మినేని ముందుంటారు. అయితే ఆయనకు మంత్రి పదవీ కాకుండా అనూహ్యంగా స్పీకర్ పదవీ దక్కింది.

‘పాజిటీవ్’ కేసుల్లో తెలంగాణ టాప్.. కానీ?
ఏపీ స్పీకర్ గా తమ్మినేని సీతారం మంచిపేరు తెచ్చుకున్నప్పటికీ ఆయనకు మంత్రి పదవీపై ఆశపోలేదని తెలుస్తోంది. స్పీకర్ గా ఉండటం వల్ల దూకుడుగా వ్యవహరించలేక పోతున్నారని అసంతృప్తిలో ఉన్నారని టాక్ విన్పిస్తుంది. ఈసారి జగన్ తనను క్యాబినెట్లో తీసుకుంటే రాజకీయంగా దూకుడు చూపించాలని ఆయన భావిస్తున్నారట. మరోవైపు శ్రీకాకుళం నుంచి మంత్రిగా చేస్తున్న ధర్మాన కృష్ణదాస్ మెతకవైఖరి అవలంభిస్తుండటంతో టీడీపీ మళ్లీ పుంజుకుంటుందనే ప్రచారం జరుగుతోంది.

దీంతో శ్రీకాకుళంలో అచ్చెన్న వంటి నేతలు దూకుడు ఎక్కువైందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలకు చెక్ పెట్టాలంటే తమ్మినేనికి మంత్రి పదవి కట్టబెట్టాలనే స్థానిక నేతలు సీఎం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీనిపై జగన్మోహన్ సానుకూలంగా స్పందించారని నేతలు చెబుతున్నారు. అయితే చివరి వరకు తమ్మినేని మంత్రి పదవుల రేసులో నిలుస్తారో? లేదో వేచిచూడాల్సిందే..!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular