Homeఆంధ్రప్రదేశ్‌Thammineni Seetharam: ఏపీ స్పీకర్ కూడా అడ్డంగా దొరికేశాడు కదా

Thammineni Seetharam: ఏపీ స్పీకర్ కూడా అడ్డంగా దొరికేశాడు కదా

Thammineni Seetharam
Thammineni Seetharam

Thammineni Seetharam: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి చర్చనీయాంశమవుతున్నారు. ఆయన నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ కొనుగోలు చేశారన్న అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ టీడీపీ నేతలు ఫేక్ సర్టిఫికెట్లను ఆధారాలతో బయటపెట్టడంతో అంతా ఇదే చర్చ నడుస్తోంది. అసలు స్పీకర్ డిగ్రీ చదవలేదు. కానీ ఆయన హైదరాబాద్‌లోని ఓ లా కాలేజీలో న్యాయశాస్త్రంలో చేరారు. ఇందు కోసం తాను డిగ్రీ పూర్తిచేసినట్టు సర్టిఫికేట్ సమర్పించారు. అయితే అది నకిలీదని తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించారు. స్పీకర్ పొందుపరచిన డిగ్రీ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన స్టడీ సెంటర్లలో వైరిఫై చేస్తే అక్కడ చదవలేదని తేలిందని, సర్టిఫికేట్ లో చూపిన హాల్ టిక్కెట్ నంబరు కూడా లేదని నర్సిరెడ్డి చెబుతున్నారు.

స్పందించిన రెండు ప్రభుత్వాలు..
కొద్దిరోజుల కిందటే నకిలీ ధ్రువపత్రాల ఇష్యూ బయటకు వచ్చింది. తొలుత తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి విషయాలను వెల్లడించారు. తరువాత శ్రీకాకుళానికి చెందిన టీడీపీ నేత కూన రవికుమార్ స్పందించారు. కానీ అటు ఏపీ ప్రభుత్వం నుంచి కానీ.. తెలంగాణ సర్కారు నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. రెండు ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలున్నాయి. కనుక ఈ విషయంలో స్పందించడం లేదన్న విమర్శ ఉంది. కానీ టీడీపీ నేతలు మాత్రం ఇష్యూను ఈజీగా వదిలేటట్టు లేదు. దీనిపై పెద్దఎత్తున ప్రచారం చేసి రాజకీయంగా ఎండగట్టాలని టీడీపీ డిసైడ్ అయ్యింది. అందుకే అటు తెలంగాణ, ఇటు ఏపీలో సైతం దీనిపై పెద్ద దుమారమే నడుస్తోంది. అటు తమ్మనేని సైతం పెద్దగా స్పందించడం లేదు. మీడియా ప్రతినిధులు అడిగినా నవ్వుతూ తప్పించుకుంటున్నారు.

రాజకీయ దుమారం..
ఫేక్ సర్టిఫికెట్లు నేరం. అందునా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి..ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించాలి. మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలి. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం ఎటువంటి ఖండన ఇవ్వడం లేదు. చిన్నగా నవ్వుతూ తప్పించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనుకూల ప్రభుత్వాలు ఉండడంతోతప్పించుకోవచ్చు.. కానీ అధికారం మారితే అధికారులు చిక్కుల్లో పడక మానరు. ప్రజాక్షేత్రంలో తలదించుకోక తప్పదని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ అంశం ముందు ముందు రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది. అసలు ఈ వయసులో ఆయన లా చదవాలని అనుకోవడం ఏమిటి.. .. అందు కోసం నకిలీ డిగ్రీని పెట్టడం ఏమిటన్నది విస్మయం కలిగించేలా ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

Thammineni Seetharam
Thammineni Seetharam

రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి..
తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుపై విరుచుకుపడడంలో తమ్మినేని ముందుంటారు. తాను పూర్వాశ్రమంలో టీడీపీలో పనిచేసినా.. కనీస ఆలోచన లేకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటారు. రాజ్యంగబద్ధ పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడుతుంటారు. అదేమని అడిగితే తాను ముందు ఎమ్మెల్యేనని.. తరువాతే స్పీకర్ అయినట్టు అడ్డగోలు వాదన చేస్తుంటారు. కానీ వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారితే ఈ నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేసి… తయారు చేసిన వారిని.. కొన్న వారిని ..వాటిని ఉపయోగించుకుని కాలేజీల్లో చేరిన వారిని విచారిస్తే అప్పుడు తమ్మినేని పరిస్తితి ఏమిటన్న వాదన వినిపిస్తోంది. ఆ ఆందోళనతో కాబోలు తమ్మినేని ఇటీవల కాస్తా తగ్గినట్టు కనిపిస్తున్నారు. మున్ముందు ఈ వ్యవహారం మరింత ముదిరే చాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version