Homeజాతీయ వార్తలుKCR: కేసీఆర్‌కు ఆ 13 సీట్లపై టెన్షన్‌.. రాహుల్‌ టూర్‌తో కాంగ్రెస్‌లో జోష్‌ !

KCR: కేసీఆర్‌కు ఆ 13 సీట్లపై టెన్షన్‌.. రాహుల్‌ టూర్‌తో కాంగ్రెస్‌లో జోష్‌ !

KCR: తెలంగాణ పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లింది. ఒకవైపు దసరా సంబరాలు జరుగుతున్నా.. పల్లె పట్టణం అని తేడా లేకుండా అంతా ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మొదటి విడత ప్రచారం పూర్తిచేసుకున్నారు. కేటీఆర్, హరీశ్‌రావు చెరో 20 నియోజకవర్గాలను చుట్టేశారు. అయితే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎంట్రీతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీఆర్‌ఎస్‌లో కనిపించాల్సిన జోష్‌ ఇప్పుడు కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్రమంతటా వాతావరణం మారుతోంది. రాహుల్‌గాంధీ సింగరేణి ప్రభావిత జిల్లాలను చుట్టేశారు. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగట్టారు. సింగరేణిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన కేసీఆర్‌ సింగరేణి ప్రభావిత జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో గెలుపుపై టెన్షన్‌ పడుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌రావు ప్రచారం చేశారు. అయినా రాహుల్‌ పర్యటన తర్వాత వారి ప్రచారాన్ని పట్టించుకోవడం మానేశారు ప్రజలు.

ఎమ్మెల్యేలు పార్టీ మారినా..
అసెంబ్లీ ఎన్నికల వేళ సింగరేణి కార్మిక సమస్యలు, వారి ఓట్ల విషయం చర్చనీ యాశం అవుతోంది. బొగ్గు గనులువు ప్రాంతాన్ని కోల్‌ బెల్ట్‌ అంటారు. తెలంగాణ లోని కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, రామగుండం, పెద్దపల్లి, మంథని, జయశం కర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, పినపాక, సత్తుపల్లి, ఇల్లందు మొత్తం 13 అసెంబ్లీ స్థానాలు సింగరేణి పరిధిలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం. ఇల్లందు, పినపాక నియోజకవర్గాలను కాంగ్రెస్‌ అభ్యర్థులు కైవసం చేసుకోగా సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, చెన్నూరు స్థానాలు బీఆర్‌ఎస్‌ ఖాతాలో, రామగుండంలో ఫార్వర్డ్‌ బాక్‌ గుర్తుపై పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ రెబర్‌ అభ్యర్థి గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాలతో కోరుకంటి చందర్‌ (ఫార్వర్డ్‌ బ్లాక్‌), గండ్ర వెంకటరమణారెడ్డి (కాంగ్రెస్‌), వనమా వెంకటేశ్వరరావు (కాంగ్రెస్‌), హరిప్రియ (కాంగ్రెస్‌), సండ్ర వెంక టవీరయ్య (టీడీపీ) బీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. అయితే కార్యకర్తలతో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారారని తమకు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ బలం ఉందని రాజకీయ విశ్లే షకులు అంటున్నారు.

అసంతృప్తిలో సింగరేని కార్మికులు?
సమస్యల పరిష్కారంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న అసంతృప్తి సింగరేణి కార్మికుల్లో ఉంది. ఏళ్లు గడుస్తున్నా తమ సమస్యలను పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పేరుతో రాజకీయాలు చేస్తూ. పబ్బం గడుపుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. సింగరేణి కార్మిక సంఘానికి గుర్తింపు ఎన్నికల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపైనా కార్మికులు గుర్రుగా ఉన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ అంశం కూడా చర్చనీ యాశంగా మారింది. ఈ అంశంలో ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డైలాగ్‌ వార్‌ నడిచింది.

ప్రైవేటీకరణ కానివ్వమన్న రాహుల్‌..
ఇంతలో ఇటీవల సింగరేణి కార్మికులతో సమావేశమైన రాహుల్‌ గాంధీ సింగరేణి ప్రైవేటీకరణ జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యలను పరిష్కరిం చేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో ఈఏరియాలో కాంగ్రెస్‌ పట్టు బిగిస్తోందన్న చర్చలు రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాహుల్‌ టూర్‌ ఇంపాక్ట్‌ కార్మికులపై పడొద్దని బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు మొదలు పెట్టిందని, ఇందులో భాగంగానే. రాహుల్‌ టూర్‌ ముగిసిన వెంటనే కార్మికులకు దసరా బోనస్‌ డబ్బులను ప్రభుత్వం విడుదల చేసిందనే టాక్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌ వినిపిస్తోంది. కోల్‌ బెల్ట్‌ పరిధిలో ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా చివరకు కార్మికులు ఎటు వైపు మళ్లుతారో వేచి చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular