TRS Tention:కర్మకాలి హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోయి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిస్తే ఇక టీఆర్ఎస్ లోని అసంతృప్తులను ఆపడం ఎవరి వల్ల కాదు.. ఇక ఇదే సమయంలో ఎంతో జోష్ తో వరంగల్ సభకు రెడీ అవుతున్న టీఆర్ఎస్ నేతల ముఖాలన్నీ వాడిపోవడం ఖాయం. కేసీఆర్ ఎలా ఈ ఓటమిని దిగమింగుకొని వరంగల్ సభకు వస్తారు? ఏం మాట్లాడాలన్నా కష్టమే. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ విజయం సాధిస్తే మాత్రం ఈ సభ పరిస్థితి ఏమిటన్న ఆసక్తికర చర్చ ఇప్పుడు సాగుతోంది.
హుజూరాబాద్ లో గెలుపు ఎవరిది అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. రేపు 2వ తేదీ ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా విజయం ఈటల రాజేందర్ దేనని చెబుతున్నా.. టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం గెల్లు శ్రీనివాస్ యాదవ్ దే గెలుపు అని ధీమాతో ఉన్నారు. ఈటల రాజేందర్ గెలిస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ తోపాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ మార్పులు వస్తాయనే చర్చ కూడా మొదలైంది.
టీఆర్ఎస్ లో హుజూరాబాద్ ఫలితంపై ఇప్పుడు గుబులు రేగుతోంది. పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు అయిన శుభ సందర్భంగా ఆ పార్టీ వరంగల్ లో విజయగర్జన సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 15న పెద్ద ఎత్తున వరంగల్ లో ఈ సభను నిర్వహించాలని దాదాపుగా డిసైడ్ అయ్యింది.దాదాపు 10 లక్షలమందితో భారీ ఎత్తున ఈ సభను నిర్వహించి విజయవంతం చేయాలని పార్టీ ముఖ్య నేతలకు కేసీఆర్ సూచించారు.
అయితే హుజూరాబాద్ ప్రత్యర్థి ఈటల రాజేందర్ గెలిస్తే వరంగల్ విజయగర్జన సభ సంగతేంటనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో మొదలైనట్టు తెలుస్తోంది. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే వరంగల్ విజయగర్జన సభను టీఆర్ఎస్ మరింత ఘనంగా నిర్వహించుకోవడానికి ఉత్సాహం లభిస్తుంది. ఒకవేళ హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ విజయం సాధిస్తే మాత్రం ఈ సభ పరిస్థితి ఏమిటన్న అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అధికార టీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇది ఖచ్చితంగా పార్టీ శ్రేణుల ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని దెబ్బతీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని టీఆర్ఎస్ ముఖ్యులు కలవరపడుతున్నారు. సో హుజూరాబాద్ ఫలితం ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రెస్టేజ్ గా భావిస్తోందని అర్థమవుతోంది.