Enemy movie: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాల్గొన్న”ఎనిమీ” టీమ్… మొక్కకు పునీత్ రాజ్ పేరు

Enemy movie: తెలంగాణలో చేపట్టిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. అయితే తాజాగా “ఎనిమీ” సినిమా టీమ్  హైదరాబాద్ కు విచ్చేశారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో హీరో విశాల్, ఆర్య, నటి మిర్నాళిని రవి “గ్రీన్ ఇండియా చాలెంజ్” లో భాగంగా హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, తెలంగాణ సి‌ఎం కేసీఆర్ చేపట్టిన “హరితహారం” స్పూర్తితో […]

Written By: Raghava Rao Gara, Updated On : November 1, 2021 7:59 pm
Follow us on

Enemy movie: తెలంగాణలో చేపట్టిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. అయితే తాజాగా “ఎనిమీ” సినిమా టీమ్  హైదరాబాద్ కు విచ్చేశారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో హీరో విశాల్, ఆర్య, నటి మిర్నాళిని రవి “గ్రీన్ ఇండియా చాలెంజ్” లో భాగంగా హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, తెలంగాణ సి‌ఎం కేసీఆర్ చేపట్టిన “హరితహారం” స్పూర్తితో ప్రారంభించిన “గ్రీన్ ఇండియా చాలెంజ్” కార్యక్రమంలో పాలు పంచుకోవడం  సంతోషంగా ఉందని అన్నారు.

గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టడానికి “గ్రీన్ ఇండియా చాలెంజ్” దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. భవిష్యత్ తరాల మనుగడకు చెట్లు పెంపకం అవసరమని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా “గ్రీన్ ఇండియా చాలెంజ్”లో పాల్గొని మొక్కలు నాటాలని విశాల్ కోరారు. అలానే ఇటీవల మరణించిన తన స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ గుర్తుగా ఈరోజు మొక్కని నాటుతున్నానని… ఈ మొక్క తన స్నేహితునికి గుర్తుగా ఉంటుందని తెలిపారు. ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగస్వామ్యం అయి మొక్కలు నాటడం ఆనందంగా ఉందని హీరో ఆర్య అన్నారు.

భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కి నటుడు ఆర్య ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాల్సిందిగా నటి మిర్నాళిని రవి కోరారు. ఇందులో భాగంగా “గ్రీన్ ఇండియా చాలెంజ్” కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని ‘ఎనిమీ’ చిత్ర బృందానికి అందజేశారు.