https://oktelugu.com/

పదవీ విరమణపై.. ఉద్యోగుల్లో టెన్షన్?

పదవీ విరమణ వయస్సు పెంపుపై తెలంగాణ సర్కార్ ఎటూ తేల్చకపోవడంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఉద్యోగ సంఘం నాయకుడి పదవీ విరమణ వయస్సు ఈనెలాఖరకు తీరనుంది. దీంతో పదవీ విరమణ పెంపు ఉంటుందని కొందరు భావిస్తుండగా.. మరికొందరెమీ అలాంటిదేమీ లేదంటూ చర్చంచుకుంటున్నారు. ప్రస్తుతం ఏ ఇద్దరు ఉద్యోగులను కదిపినా ఇదే చర్చ జోరుగా నడుస్తోంది. Also Read: గ్రేటర్ లో ‘ముందస్తు’ ఎన్నికలు? సీఎం కేసీఆర్ గతంలోనే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 29, 2020 7:39 pm
    Follow us on


    పదవీ విరమణ వయస్సు పెంపుపై తెలంగాణ సర్కార్ ఎటూ తేల్చకపోవడంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఉద్యోగ సంఘం నాయకుడి పదవీ విరమణ వయస్సు ఈనెలాఖరకు తీరనుంది. దీంతో పదవీ విరమణ పెంపు ఉంటుందని కొందరు భావిస్తుండగా.. మరికొందరెమీ అలాంటిదేమీ లేదంటూ చర్చంచుకుంటున్నారు. ప్రస్తుతం ఏ ఇద్దరు ఉద్యోగులను కదిపినా ఇదే చర్చ జోరుగా నడుస్తోంది.

    Also Read: గ్రేటర్ లో ‘ముందస్తు’ ఎన్నికలు?

    సీఎం కేసీఆర్ గతంలోనే ఉద్యోగుల పదవీ విమరణ వయస్సును 58నుంచి 60ఏళ్లకు పెంచుతారని హామీ ఇచ్చినట్లు సమాచారం. పలు క్యాబినెట్ మీటింగులోనూ ఉద్యోగ పదవీ విరమణ వయస్సు పెంచాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ ఎందుకో ఆచరణకు మాత్రం నోచుకోలేదు. సీఎంతో తొలి నుంచి సన్నిహితంగా ఉండే ఉద్యోగ సంఘం నేతలకు టీఆర్ఎస్ పాలనలో మంచి పదవులు దక్కాయి. ఓ ప్రధాన సంఘం నేతకు గతంలో శానసమండలి చైర్మన్ పదవీ దక్కింది. ఇక మరో సంఘం నేతకు ఎమ్మెల్యేతోపాటు మంత్రి పదవీ దక్కిన సంగతి తెల్సిందే.

    అయితే ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ పీఆర్సీ, పదవీ విమరణ వయస్సు పెంపులో మాత్రం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఉద్యోగులు సర్కార్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ప్రధాన ఉద్యోగ సంఘం అధ్యక్షుడి పదవీ మరి కొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో పదవీ విరమణ వయస్సు పెంపు ఉంటుందా? ఉండదా? అనే చర్చ ఉద్యోగ వర్గాల్లో సాగుతోంది.

    Also Read: అదే జరిగితే.. హైదరాబాద్ లో తట్టుకోగలమా?

    సీఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తికి పదవీ విరమణ పెంపు లేకుంటే రానున్న రోజుల్లో ఇది అటెకెక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. కాగా గతంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ రమేష్ రెడ్డి పదవీ విరమణ చివరి రోజునే ప్రభుత్వం పెంచింది. బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యుల పదవీ విరమణ వయస్సును 65ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

    గతంలో మాదిరిగానే ప్రస్తుతం కూడా ఇలానే జరుగుతుందని ఉద్యోగ సంఘం నేతలు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి పిలుపు కోసం నేతలు ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పదవీ విరమణ వయస్సును పెంచుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.