https://oktelugu.com/

సైరా నటుడితో సన్నీ లియోన్‌ ఐటమ్ సాంగ్‌

సన్నీ లియోన్‌. బాలీవుడ్‌ అందాల ఆటం బాంబ్‌. పోర్న్‌ స్టార్ నుంచి భారత సినీ పరిశ్రమలో టాప్‌ స్టార్ గా మారిన సన్నీకి దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. కొచ్చిలాంటి చిన్న నగరంలో ఓ షాప్‌ ఓపెనింగ్‌కు వచ్చిన తనని చూసేందుకు ఏకంగా రెండు మూడు లక్షల మంది వచ్చారంటేనే ఆ పాపులారిటీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తొలుత ఐటమ్‌ సాంగ్స్‌తో మెప్పించిన లియోన్‌ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌, హీరోయిన్‌గానూ మారింది. కానీ, ఏ పాత్రలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 29, 2020 / 07:27 PM IST
    Follow us on


    సన్నీ లియోన్‌. బాలీవుడ్‌ అందాల ఆటం బాంబ్‌. పోర్న్‌ స్టార్ నుంచి భారత సినీ పరిశ్రమలో టాప్‌ స్టార్ గా మారిన సన్నీకి దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. కొచ్చిలాంటి చిన్న నగరంలో ఓ షాప్‌ ఓపెనింగ్‌కు వచ్చిన తనని చూసేందుకు ఏకంగా రెండు మూడు లక్షల మంది వచ్చారంటేనే ఆ పాపులారిటీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తొలుత ఐటమ్‌ సాంగ్స్‌తో మెప్పించిన లియోన్‌ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌, హీరోయిన్‌గానూ మారింది. కానీ, ఏ పాత్రలో కనిపించినా.. అందాలను ఆరబోయడంలో మాత్రం తేడా ఉండదు. ఆమె కోసమే చాలా మంది కుర్రాళ్లు థియేటర్లకు వస్తుంటారు. దాంతో, సన్నీని తమ సినిమాలో భాగం చేసుకుంటే మంచి పబ్లిసిటీ లభిస్తుందని దేశంలోని అన్ని భాషల చిత్ర పరిశ్రమలు అనుకుంటున్నాయి. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, బెంగాలీ పరిశ్రమలో అడుగు పెట్టిందామె.

    Also Read: ఆదిపురుష్.. ఫ్యాన్ మేడ్ వీడియో వైరల్

    చాలా మంది హీరోలతో ఆడిపాడిన సన్నీ లియోన్‌ ఇప్పుడు కన్నడ స్టార్ హీరో, సౌతిండియా యాక్టర్ కిచ్చా సుదీప్‌తో కూడా స్టెప్పులేయనుంది. సుదీప్‌ హీరోగా నటిస్తున్న యాక్షన్‌ డ్రామా ‘కోటిగొబ్బా3’ (కే3) మూవీలో సన్నీ ఓ ఐటమ్‌ సాంగ్‌ చేయనుంది. కన్నడతోపాటు తమిళ్‌, తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా సుదీప్‌ సుపరిచితమే. ఈగలో విలన్‌గా మెప్పించిన అతను.. చిరంజీవి హీరోగా వచ్చిన ప్రతిష్టాత్మక ‘సైరా నరసింహా రెడ్డి’లో కీలక పాత్రతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తను నటించే సినిమాలను దక్షిణాది అన్ని భాషల్లో రిలీజ్‌ చేయాలని నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా మార్కెటింగ్‌, పబ్లిసిటీ రాబట్టేందుకు సన్నీతో ఐటమ్‌ సాంగ్‌ ప్లాన్‌ చేశారు. సౌత్‌లో ఇప్పటికే చాలా సినిమాల్లో ప్రత్యేక పాటలు చేసిందామె. ఇప్పుడు సుదీప్‌తో ఆమె ఆటపాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సాంగ్‌ హిట్‌ అవుతుందని ఆమె ఆత్మవిశ్వాసంతో ఉంది. ‘నా డ్యాన్సింగ్‌ స్కిల్స్‌, ఐటమ్‌ సాంగ్స్‌ను ప్రజలు ఇష్టపడుతున్నారని తెలిసి చాలా సంతోషిస్తున్నా. ఈ క్రెడిట్ మొత్తం సంగీత, నృత్య దర్శకులకే వెళ్తుంది. కే3 ఐటమ్‌ నంబర్ ను అందంగా ప్లాన్‌ చేశారు. ఇది కచ్చితంగా హిట్‌ అవుతుందన్న నమ్మకం ఉంది’ అని సన్నీ అంటోంది.