Homeఆంధ్రప్రదేశ్‌Daggubati Purandeswari: పురందేశ్వరికి జై కొడుతున్న తెలుగుదేశం

Daggubati Purandeswari: పురందేశ్వరికి జై కొడుతున్న తెలుగుదేశం

Daggubati Purandeswari: బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు జై కొడుతున్నాయి. తమ విలువైన సలహాలను, సూచనలను ఇస్తున్నాయి. ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణలో లక్ష్మీపార్వతిని దూరం పెట్టడంపై అభినందనలతో ముంచేత్తుతున్నాయి. ఎవరిని ఎక్కడ పెట్టాలో చిన్నమ్మకు తెలుసునంటూ సోషల్ మీడియాలో టిడిపి అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ట్రోల్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని వివాహమాడినా చెప్పులో దూళి, చెవి చుట్టూ తిరిగే జోరీగ మాదిరిగా చూస్తున్నారు. నాడు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నది సామాజిక తప్పిదంగా చంద్రబాబు అండ్ కో, టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. వారి వైవాహిక జీవితం వ్యక్తిగతమైనప్పటికీ.. దానిని సామాజిక తప్పిదంగానే ఇప్పటికీ చూపిస్తున్నారు. అయితే ఇది నందమూరి హరికృష్ణకు, రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఇతర నాయకులకు వర్తించదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అవసరానికి తగ్గట్టు వైవాహిక జీవితాలకు నిర్వచనాలు ఇస్తుండడం విశేషం.

నందమూరి హరికృష్ణ నే తీసుకుందాం. ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. అటువంటప్పుడు అది సామాజిక సమస్య కాదా? అప్పుడు అదే హరికృష్ణకు టిడిపి పొలిట్ బ్యూరో మెంబర్ ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు, చివరకు రాజ్యసభ సైతం కట్టబెట్టారు. అదే హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ను ప్రచారానికి వాడుకున్నారు. తీరా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెట్టారు. అంటే వాళ్ల అవసరం వచ్చినప్పుడు వ్యక్తిగతం.. అవసరం లేనప్పుడు సామాజిక తప్పిదంగా భావించి పక్కన పెట్టడం టిడిపికి తెలిసినట్టుగా మరి ఏ పార్టీకి తెలియదు.

పవన్ కళ్యాణ్ నే తీసుకుందాం. టిడిపి తో విభేదించే సమయంలో ఆయన వైవాహిక జీవితం గురించి ఎక్కువగా మాట్లాడింది పచ్చ పార్టీ నాయకులే. ఇప్పుడు అదే పవన్ అవసరం వచ్చేసరికి.. ఆయన వైవాహిక జీవితం వ్యక్తిగతమంటూ చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు లక్ష్మీపార్వతి సైతం ఎన్టీఆర్ భార్యగా లేవనెత్తిన ప్రశ్నలపై కొత్త ప్రచారం ప్రారంభించారు. పురందేశ్వరిని అడ్డం పెట్టుకొని అడ్డగోలు వాదనకు దిగుతున్నారు. పురందేశ్వరి లక్ష్మీపార్వతికి గట్టి గుణపాఠమే చెప్పారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రశంసించడం కొత్త అంకానికి తెరలేపింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular