తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇంకా పదవీ బాధ్యతలు తీసుకోకముందే రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయాలను చూపిస్తున్నాడు. ఆయన పీసీసీ చీఫ్ అని అధిష్టానం నుంచి ప్రకటన వెలువడిన తెల్లారి నుంచి రేవంత్ తెలంగాణలోని రాజకీయ పార్టీలపై విరుచుకుపడ్డాడు. అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బాణాలను ఎక్కుపెట్టి రోజుకో అస్త్రం విడుస్తున్నారు. తాజాగా ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును వాడుకుంటూ ఆయన అభిమానులను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదంలో వైఎస్ పాత్రమీలేదని రేవంత్ కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తిడితే ఊరుకోమని టీఆర్ఎస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై తీవ్ర ఘాటు వ్యాక్యలు చేసినా ఆయన కుమారుడు, ఏపీ సీఎం జగన్ ఏ విధంగాను రియాక్ట్ కాలేదు. ఆయన కూతురు షర్మిల కూడా స్పందించలేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఆయనను ఇకపై తిడితే ఊరుకోమని అంటున్నారు.
అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగా రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా ఉన్నారు. రేవంత్ ను వైఎస్ కాంగ్రెస్ లోకి ఆహ్వానించినా ఆయన అందులో చేరక టీడీపీలో చేరారు. ఆ తరువాత వైఎస్ పై నిత్యం పోరు కొనసాగించారు. అయితే పార్టీ మారినప్పుడు అభిప్రాయాలు కూడా మార్చుకోవాలన్నట్లుగా రేవంత్ రెడ్డి పార్టీకి అనుగుణంగా నడుచుకుంటున్నాడు. వైఎస్ రాష్ట్రానికి ఎంతో చేశాడని పొగడడంతో కాంగ్రెస్లోని ఆయన అభిమానులు రేవంత్ కు మద్దతు పలుకుతున్నారు.
ఇక వైఎస్ అభిమానులను వేరు చేసేందుకు షర్మిల కొత్త పార్టీని పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు షర్మిల వైపు వెళ్లిన వారు తిరిగి కాంగ్రెస్ లోకి వస్తారా..? అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే వివిధ పార్టీలోని రేవంత్ అభిమానులు తిరిగి కాంగ్రెస్ లోకి రావడానికి రెడీ అవుతున్నారు. చెన్నూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి బోడ జనార్దన్ బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ వైఎస్ పాట పాడుతుండడంతో ఆయన అభిమానులు రేవంత్ వైపు వస్తారా..? చూడాలి..