
Telugu States Water War: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జలవివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. రెండు స్టేట్ల మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. రెండు ప్రాంతాల మధ్య జల వివాదాలకు చెక్ పెట్టడానికి కేంద్రం రంగంలోకి దిగి గెజిట్ జారీ చేసింది. దీంతో జల ప్రాజెక్టుల పంచాయతీ కాస్త కేంద్రం పరిధిలోకి వెళ్లింది. అయినా రెండు ప్రాంతాల తీరు మారడం లేదు. అనుమతి లేకుండా తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచేందుకు విస్తరణ పనులు చేపట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది.
తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై స్పందించిన ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు తక్షణమే సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, ఏపీ ఇంజినీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి ఈమేరకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు లేఖను లేఖతో జతపరిచింది. దీనికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పంపిన లేఖపై ఏపీ ఏ విధంగా స్పందిస్తుందోనని వేచి చూస్తున్నారు.
హంద్రీనీవా ప్రాజెక్టు నీటి వాడకంపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ ప్రాంతాలను కాదని 700 కిలోమీటర్ల దూరానికి నీటిని తరలించడం అన్యాయమని పేర్కొంది. కృష్ణా బోర్డుపై ఒత్తిడి తెస్తోంది. రాయలసీమ ప్రాజెక్టుపై ప్రభుత్వం చెబుతుంది ఒకటి చేస్తుంది మరొకటి అని ఫిర్యాదు చేస్తోంది. తాజాగా మరోమారు వెలిగొండ ప్రాజెక్టు, తెలుగుగంగ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.
తెలంగాణ, ఏపీ ప్రాంతాలు జల వివాదాలపై లేఖలు రాస్తూనే ఉన్నాయి. సమస్యలు పరిష్కరించడంలో కృష్ణా యాజమాన్య బోర్డు విఫలం అవుతూనే ఉంది. బోర్డు ఆదేశాలను ఇరు ప్రాంతాలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం బోర్డు మీటింగుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఢిల్లీలో తేల్చుకుంటామని చెబుతోంది. ఈమేరకు కేసీఆర్ ఢిల్లీ లో మకాం వేసి ప్రధాని మోడీ, అమిత్ షాలను కలుసుకుని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.