https://oktelugu.com/

ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో పరిస్థితి దిగజారుతోందా?

దేశంలోకి కరోనా వైరస్ ఎంట్రీ ఇవ్వగానే కేంద్రం లాక్డౌన్ విధించింది. కేవలం పదుల సంఖ్యలో ఉన్నప్పుడు లాక్డౌన్ విధించినా వైరస్ కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైంది. రోజురోజుకు వేలల్లో నమోదవుతున్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే వైరస్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో కేంద్రం ‘కరోనాతో సహజీవనం’ అంటూ కొత్త పల్లవి అందుకుంది. దేశం సంగతి కొంచెంసేపు పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాల గురించి చూస్తే పరిస్థితి మరోలా ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వైరస్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 12, 2020 / 12:41 PM IST
    Follow us on


    దేశంలోకి కరోనా వైరస్ ఎంట్రీ ఇవ్వగానే కేంద్రం లాక్డౌన్ విధించింది. కేవలం పదుల సంఖ్యలో ఉన్నప్పుడు లాక్డౌన్ విధించినా వైరస్ కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైంది. రోజురోజుకు వేలల్లో నమోదవుతున్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే వైరస్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో కేంద్రం ‘కరోనాతో సహజీవనం’ అంటూ కొత్త పల్లవి అందుకుంది. దేశం సంగతి కొంచెంసేపు పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాల గురించి చూస్తే పరిస్థితి మరోలా ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వైరస్ కేసుల సంఖ్యలో నువ్వా.. నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి.

    ఏపీ కంటే తెలంగాణలో రోజురోజుకు పరిస్థితి దిగజారిపోతున్నట్లు కన్పిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ విధించారు. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ప్రభుత్వానికి అన్నివిధలా సహకారం అందించారు. ప్రభుత్వం తొలుత కఠిన చర్యలతో కరోనా కొంతమేర కట్టడి అయినట్లు కన్పించింది. కొన్నిరోజులుపాటు అన్ని జిల్లాలో సింగిల్ డిజిట్ కేసులే నమోదయ్యాయి. దీంతో పరిస్థితి అదుపులోని ఉందనే భావన అందరిలో నెలకొంది. హైదరాబాద్ మహానగరం మినహా అన్ని జిల్లాలు కరోనా ఫ్రీ గా మారుతున్న సందర్భంలో మరోసారి కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

    రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తేయడంతో జీచ్ఎంసీతోపాటు మళ్లీ అన్ని జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన పది రోజులుగా కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. అంతేందుకు గురువారం నాటి పరిస్థితే తీసుకుంటే రాష్ట్రంలో 209 కేసులు కొత్తగా నమోదయ్యాయి. హైదరాబాద్ మహానగరంలోనే అత్యధికంగా 175కేసులు నమోదవడం గమనార్హం. మరోవైపు తెలంగాణతో ఏపీని పొలిస్తే అక్కడ పరిస్థితులు కొంతమెరుగ్గా ఉన్నాయి. ఏపీలో టెస్టుల సంఖ్య ఎక్కువ చేస్తున్న కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. ఏపీలో గురువారం 182కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా తెలంగాణలో ఇటీవల కాలంలో ఎక్కువ నమోదవుతున్నాయి.

    ప్రస్తుతానికి ఏపీలో 5,429 కేసులుండగా తెలంగాణలో 4,320 కేసులున్నాయి. అయితే ఏపీలో టెస్టుల సంఖ్య ఎక్కువగా చేస్తున్నప్పటికీ కేసులు ఎక్కువగా నమోదవడం లేదు. అదే తెలంగాణలో టెస్టులు తక్కువగా చేస్తున్నప్పటికీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఏపీతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి దిగజారినట్లు కన్పిస్తుంది. మరణాల్లోనూ తెలంగాణలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏపీలో 80మంది వైరస్ తో మృతిచెందగా తెలంగాణలో 165మంది మృత్యువాతపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గురువారం ఏపీలో ఇద్దరు మరణించగా తెలంగాణలో తొమ్మిదిమంది మృతిచెందటం గమనార్హం. తెలంగాణలో లాక్డౌన్ తర్వాత కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరింత అప్రతమతంగా ఉండాల్సిన అవసరం ఉంది. సీఎం కేసీఆర్ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!