spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Mudragada Padmanabham: ముద్ర‌గ‌డ కాపుల‌కు అవ‌స‌రం లేదా?

Mudragada Padmanabham: ముద్ర‌గ‌డ కాపుల‌కు అవ‌స‌రం లేదా?

Mudragada Padmanabham:  ముందొచ్చే చెవుల‌కంటే వెన‌కొచ్చే కొమ్ముల‌కే వాడి అనేది సామెత‌. కాపు సామాజిక వ‌ర్గం కోసం ఎంతో కష్ట‌ప‌డిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ప్ర‌స్తుతం ఒంట‌రైపోయారు. స‌ర్వ‌స్వం ధార‌పోసి ఉద్య‌మం న‌డిపిన వ్య‌క్తిని ప్ర‌స్తుతం ప‌క్క‌న పెట్టేశారు. రాజ‌కీయ చ‌ద‌రంగంలో పావుగా వాడుకున్నారు. కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ఆయ‌న చేసిన త్యాగం ఎప్ప‌టికి మ‌రువ‌లేనిది. కానీ ఆయ‌న ఇప్పుడు కాపుల‌కు శ‌త్రువులా మారారు. ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో మ‌రింత డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయారు. ఇంత చేసినా త‌న‌కు ఇచ్చిన గౌర‌వం ఇదేనా అని మ‌థ‌న‌ప‌డుతున్నారు.

Mudragada Padmanabham:
Mudragada Padmanabham:

సొంత కులంలోనే వేరు కుంప‌ట్లు ర‌గులుకుంటున్నాయి. ఇన్నాళ్లు ముద్ర‌గ‌డతోనే కాపుల‌కు గుర్తింపు వ‌చ్చినా ప్ర‌స్తుతం ఆయ‌న సేవ‌ల‌ను ప‌క్క‌న‌పెడుతున్నారు. అప్ప‌ట్లో ఆయ‌న మంత్రిప‌ద‌విని సైతం వ‌దులుకున్నారు. కాపుల రిజ‌ర్వేష‌న్ల కోసం దీక్ష చేసిన స‌మయంలో జ‌ర‌గిన తుని సంఘ‌ట‌న‌తో అల్ల‌ర్లు రేగిన సంగ‌తి తెలిసిందే. అప్పుడే రైలును త‌గుల‌బెట్టిన నేప‌థ్యంలో ఉద్య‌మం ప‌క్క‌దారి ప‌ట్టింద‌నే ఆరోప‌ణ‌లు సైతం వ‌చ్చాయి. దీంతో నిర‌స‌న జ్వాల‌లు మిన్నంటాయి. ప్ర‌భుత్వం అంద‌రిపై కేసులు న‌మోదు చేసినా ప్ర‌స్తుత ప్ర‌భుత్వం వాటిని ఎత్తేయ‌డం అంద‌రిలో హ‌ర్షం వ్య‌క్త‌మైంది.

Also Read: తరచూ ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. పాటించాల్సిన వాస్తు చిట్కాలు ఇవే!

కానీ ముద్ర‌గ‌డ జ‌గ‌న్ ను క‌లిసేందుకు సైతం భ‌య‌ప‌డాల్సి వ‌స్తోంది. ఇందులో కూడా ఏదో రాజ‌కీయం ఉంద‌ని ప్ర‌చారం చేస్తార‌ని భ‌య‌ప‌డుతున్నారు. కాపుల‌కు అండ‌గా నిలిచి వారికి మార్గ‌నిర్దేశం చేసిన వ్య‌క్తికే ప్ర‌స్తుతం తిప్ప‌లు ఎదుర‌వుతున్నాయి. కాపుల‌ను కాపాడిన నాయ‌కుడికే కాలం క‌లిసి రావ‌డం లేదు. ఫ‌లితంగా మ‌రో కాపు సంఘం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ముద్ర‌గ‌డ‌ను ప‌క్క‌న పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతోనే ఆయ‌న‌లో భ‌యం ప‌ట్టుకుంది.

Mudragada Padmanabham:
Mudragada Padmanabham:

ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ముద్ర‌గ‌డ‌కు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదో అర్థం కావ‌డం లేదు. మొత్తానికి కాపు సామాజిక వ‌ర్గానికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన నేత‌నే కాద‌న‌డం క్ష‌మించ‌రాని నేరంగా భావిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంద‌నే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఏం నేరం చేశార‌ని దూరం పెడుతున్నారో తెలియ‌డం లేదు. కానీ కాపుల ఉనికిని లోకానికి చాటిచెప్పింది మాత్రం ముద్ర‌గ‌డే అన్న సంగ‌తి అంద‌రు గుర్తించ‌డం లేద‌ని తెలుస్తోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Jeetendra Property

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...
Jogi Ramesh

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...
Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Oktelugu Epaper