భారత్-చైనా సైనికుల ఘర్షణలో తెలుగువాసి మృతి

భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే. ఇటీవలే ఇరుదేశాల మధ్య ఆర్మీ అధికారులు చర్చల నేపథ్యంలో కొంత ఉద్రిక్తత తగ్గింది. ఇరుదేశాలు ఎల్ఏసీ నుంచి కొంతమేరకు వెనక్కి వెళుతున్న నేపథ్యంలో సోమవారం ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. లఢక్ సమీపంలోని గాల్వనా వ్యాలీలో చైనా-భారత్ మధ్య ఘర్షణ జరుగగా ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇందులో మృతిచెందిన లెప్ట్ నెంట్ కల్నల్ స్థాయి అధికారి తెలుగువాడు కావడం విషాదంగా మారింది. సూర్యపేట జిల్లాకు చెందిన […]

Written By: Neelambaram, Updated On : June 16, 2020 7:28 pm
Follow us on


భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే. ఇటీవలే ఇరుదేశాల మధ్య ఆర్మీ అధికారులు చర్చల నేపథ్యంలో కొంత ఉద్రిక్తత తగ్గింది. ఇరుదేశాలు ఎల్ఏసీ నుంచి కొంతమేరకు వెనక్కి వెళుతున్న నేపథ్యంలో సోమవారం ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. లఢక్ సమీపంలోని గాల్వనా వ్యాలీలో చైనా-భారత్ మధ్య ఘర్షణ జరుగగా ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇందులో మృతిచెందిన లెప్ట్ నెంట్ కల్నల్ స్థాయి అధికారి తెలుగువాడు కావడం విషాదంగా మారింది.

సూర్యపేట జిల్లాకు చెందిన సంతోష్ బాబు ఏడాదిన్నరగా చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నాడు. కల్నల్ స్థాయి అధికారిగా ఆయన ఆర్మీలో సేవలందిస్తున్నాడు. కాగా సోమవారం రాత్రి ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్ తోపాటు మరో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. సంతోష్ బాబు మృతిపై ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్ బాబుకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు. అయితే ఇరుదేశాల మధ్య కాల్పులు జరగలేదని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో సంతోష్ బాబుతోపాటు మరో ఇద్దరు జవాన్లు మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

సంతోష్ బాబు విజయనగరంలోని కోరుకొండ సైనిక్ పాఠశాలలో విద్యాభాసం చేశారు. నెలరోజుల క్రితమే కల్నల్ తమ అధ్యాపకులను కలిసినట్లు తెలుస్తోంది. సంతోష్ బాబుకు మూడునెలల క్రితమే హైదరాబాద్ బదిలీ అయింది. అయితే లాక్డౌన్ కారణంగా ఆయన భారత సరిహద్దుల్లోనే విధులు ఉండాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో సోమవారం రాత్రి ఘర్షణలో ఆయన మృతిచెందాడంతో సూర్యాపేటలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆ వీరసైనికుడికి అందరూ నివాళ్లు అర్పిస్తున్నారు. సంతోష్ బాబు మృతిపై అతడి తల్లి స్పందిస్తూ తన కుమారుడు వీరమరణం పొందడం సంతోషంగా ఉందని.. ఒక తల్లిగా బాధగా ఉందని వాపోయింది.