భారత్ ను దొంగదెబ్బ కోడుతున్న చైనా

గత కొంతకాలంగా భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తోంది. లద్దాక్ సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికులు మోహరించడంతో కొన్నిరోజులుగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల ఆర్మీ ఉన్నతాధికారులు చర్చలు జరుపడంతో కొంత ఉద్రిక్తత తగ్గింది. ఎల్ఏసీ నుంచి ఇరుదేశాలు కొంతమేరకు వెనక్కి తగ్గాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సోమవారం ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. లఢక్ సమీపంలోని గాల్వనా వ్యాలీలో చైనా-భారత్ మధ్య ఘర్షణ జరుగగా ఇందులో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఒక […]

Written By: Neelambaram, Updated On : June 16, 2020 7:24 pm
Follow us on


గత కొంతకాలంగా భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తోంది. లద్దాక్ సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికులు మోహరించడంతో కొన్నిరోజులుగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల ఆర్మీ ఉన్నతాధికారులు చర్చలు జరుపడంతో కొంత ఉద్రిక్తత తగ్గింది. ఎల్ఏసీ నుంచి ఇరుదేశాలు కొంతమేరకు వెనక్కి తగ్గాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సోమవారం ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. లఢక్ సమీపంలోని గాల్వనా వ్యాలీలో చైనా-భారత్ మధ్య ఘర్షణ జరుగగా ఇందులో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఒక లెప్ట్ నెంట్ కల్నల్ స్థాయి అధికారి ఉన్నారు.

భారత్ జవాన్లు మృతిచెందడంతో సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికులు ఎటువంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఇరువైపులా ప్రాణనష్టం సంభవించినట్లు భారత ఆర్మీ అధికారులు పేర్కొంటున్నారు. భారత్ నుంచి కల్నల్ స్థాయి ర్యాంకు గల కమాండింగ్ అధికారి, ఇద్దరు జవాన్లు అమరులైనట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అలాగే చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు మరణించినట్లు ప్రకటించింది. అయితే ఎంతమంది మృతిచెందారనేది మాత్రం ప్రకటించలేదు. భారత్-చైనా ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్న క్రమంలోనే అనూహ్యంగా ఈ సంఘటన చోటుచేసుకోవడంతో కేంద్రం ఉలికిపాటుకు గురైంది.

ఈ సంఘటనపై వెంటనే రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సరిహద్దుల్లో ప్రాణనష్టానికి దారితీసిన సంఘటనలు, చైనా పై ఎలాంటి వైఖరి అవలంభించాలనేది ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే సరిహద్దు సమస్యలపై చైనాతో భారత్ తొలి దశ చర్చలు ముగిశాయి. మరి కొద్దిరోజుల్లో రెండో దఫా చర్చలు ఉన్న నేపథ్యంలో ఇరుదేశాల సైనికులు మృతిచెందడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రెండోదశ చర్చలు ఉంటాయా? లేదా అనే చర్చ జరుగుతోంది.

1975తర్వాత భారత్-చైనా సరిహద్దుల్లో సైనికులు మృతిచెందే ఘర్షణలు తలెత్తడం ఇదే తొలిసారి. కాగా సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడంపైనే చైనా-భారత్ కట్టుబడి ఉన్నట్లు ఇరు దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే చైనా ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు భారత్ ను దొంగదెబ్బ కొట్టడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు యుద్ధానికి దారితీయనున్నాయా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చైనా విషయంలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళుతుందో వేచి చూడాల్సిందే..!